iDreamPost
android-app
ios-app

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్స్ ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్!

Bharti Airtel Scholarships: వివిధ రకాలుగా విద్యార్థులకు స్కాలర్ షిప్ అందుతుంటాయి. కొందరు పరీక్షలు నిర్వహించి.. విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..తాజాగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ శుభవార్త వచ్చింది.

Bharti Airtel Scholarships: వివిధ రకాలుగా విద్యార్థులకు స్కాలర్ షిప్ అందుతుంటాయి. కొందరు పరీక్షలు నిర్వహించి.. విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..తాజాగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ శుభవార్త వచ్చింది.

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్స్ ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్!

చదువుకునే వారికి అనేక అవకాశాలు లభిస్తుంటాయి. ఆర్థికంగా వెనుబడిన వారికి వివిధ రకాల స్కాలర్ షిప్ లు అందుబాటులో ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు  విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తాయి. కొందరు పరీక్షలు నిర్వహించి.. విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..తాజాగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ శుభవార్త వచ్చింది. ప్రముఖ టెలీకాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసే దిశగా అడుగులు వేస్తుంది. మరి.. ఎయిర్ టెల్ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే రీఛార్జ్ ధరలు పెంచిన సంగతి తెలిసింది. అంతేకాక తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతి ఎయిర్టెల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది.  ఈ ఫౌండేషన్ బిటెక్ విద్యార్థుల కోసం ఈ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ స్కాలర్ షిప్ ప్రొగ్రామ్ కి ఎంపికైన వారికి…పలు రకాల బెనిఫిట్స్ అందుతున్నాయి. ఈ స్కాలర్ షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ల్యాప్ టాప్, మెస్ ఫీ వంటి ఇతర అందించనున్నాయి.

భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛారిటీ విభాగమైన ఎయిర్ టెల్ ఫౌండేషన్ తన 25 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకుంది. ఈ నేపథ్యంలోనే ‘భారతీ ఎయిర్టెల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఈ స్కాలర్ షిప్ అనేది విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  విద్యార్థులకు ఆర్థిక మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుందని ఫౌండేషన్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇందులో ముఖ్యంగా చదువుకనే ప్రాధాన్యత ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాక ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హతలను కూడా తెలిపింది.

సాంకేతికత ఆధారిత బిటెక్ చదువుతున్న యూజీ విద్యార్థులు, టాప్-50 ఎన్ ఐఆర్ఎఫ్ కాలేజీల్లో  ఐదేళ్లు ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్  ఈ స్కాలర్ పిష్ ను పొందేందుకు అర్హులు. అదే విధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8.5 లక్షలు కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ కి అర్హులు. ఇక ఈ స్కాలర్ షిప్ పొందిన విద్యార్థులు తమ చదువు పూర్తయ్యేంత వరకు  కాలేజీ ఫీజులో 100 శాతం పొందుతారు. అలానే వారికి ల్యాప్ టాప్, హాస్టల్, మెస్ ఫీజులు కూడా ఈ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సంవత్సరం 250 మంది అర్హులైన విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందజేస్తామని భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రతిఏటా ఈ స్కాలర్ షిప్ పొందే విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తామని తెలిపింది. స్కాలర్ షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ bhartifoundation.org/bharti-airtel-scholarship ను సందర్శించండి.