AP-Dussehra Holidays 2024-25: స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన సర్కార్‌.. ఈ సారి ఎన్ని రోజులంటే

School Holidays: స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన సర్కార్‌.. ఈ సారి ఎన్ని రోజులంటే

AP-Dussehra Holidays 2024 25: దసరా పండుగకు ఎన్ని రోజులు సెలవులు రానున్నాయి.. ఎప్పటి నుంచి హలీడేస్‌ ఇస్తున్నారు అనే దానిపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ వివరాలు..

AP-Dussehra Holidays 2024 25: దసరా పండుగకు ఎన్ని రోజులు సెలవులు రానున్నాయి.. ఎప్పటి నుంచి హలీడేస్‌ ఇస్తున్నారు అనే దానిపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ వివరాలు..

పాఠశాలలు ప్రారంభం అయ్యాయంటే చాలు.. విద్యార్థులు సెలవుల కోసమే ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఏడాది పాఠశాలలు మొదలు కాగానే.. వరుసగా జోరు వర్షాలు కురవడంతో.. చాలా ప్రాంతాల్లో సూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 16 వరలక్ష్మీ వ్రతం, 17 శనివారం చాలా స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఇక 18 ఆదివారం, 19 సోమవారం రాఖీ పండుగ రానున్నాయి. దాంతో వరుసగా 5 రోజులు సెలవులు రావడం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి.. ఎన్ని రోజులు ఉన్నాయి అనే దానిపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబరు 4-13 వరకు ఉండనున్నాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా స్కూళ్లకు 10 రోజులు సెలవులు ఇస్తోంది ప్రభుత్వం. క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇస్తారు. మరోవైపు.. సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి.

ఈ ఏడాది ఏపీలో పాఠశాలలకు 232 రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే.. 83 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ క్యాలెండర్‌ ప్రకారం.. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి.

ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులను ఎప్పుడో ప్రకటించారు. అకాడమిక్‌ క్యాలెండర్‌లో దీనిపై ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు అనగా 12 రోజులు హలీడేస్‌ రానున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉండనున్నాయి. అలానే తెలంగాణలో సంక్రాంతి సెలవులు జనవరి 13-17, 2025 వరకు ఇవ్వనున్నారు. ఈ సెలవులు ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలకు సమానంగా వర్తిస్తాయి.

Show comments