iDreamPost
android-app
ios-app

వినాయక చవితి రోజున.. విగ్రహాన్ని ఈ సమయంలోనే పెట్టాలి..

  • Published Sep 06, 2024 | 10:47 AM Updated Updated Sep 06, 2024 | 11:19 AM

Vinakaya Chaviti 2024: చిన్న నుంచి పెద్ద వరకు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. అయితే ఈ ఏడాది ఈ వినాయక చవితి పండుగనాడు విగ్రహాం ఏ సమయంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

Vinakaya Chaviti 2024: చిన్న నుంచి పెద్ద వరకు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. అయితే ఈ ఏడాది ఈ వినాయక చవితి పండుగనాడు విగ్రహాం ఏ సమయంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

  • Published Sep 06, 2024 | 10:47 AMUpdated Sep 06, 2024 | 11:19 AM
వినాయక చవితి రోజున.. విగ్రహాన్ని ఈ సమయంలోనే పెట్టాలి..

దేశవ్యాప్తంగా చిన్న నుంచి పెద్ద వరకు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చేసింది. మరీ ఆ పండుగ ఏదో కాదు వినాయక చవితి. దీనినే గణేశ్ ఛతుర్ధి, గణేష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ పండుగ కోసం మూడు నెలల ముందు నుంచే హడావిడి మొదలుపెడతారు. అంతేకాకుండా.. గ్రామాల దగ్గర నుంచి పట్టణ నగరాల వరకు ఈ గణపతి నవరాత్రలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇకపోతే ఈ వినాయక చవితిని ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు. అయితే ఆ పర్వదినంనాడు విఘ్నేశ్వరుడి జన్మదినం కావున అన్ని విఘ్నాలకు తొలగించే మహా గణపతిని ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే..ఈ ఏడాది ఈ వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలి..? విగ్రహాం ఏ సమయంలో ప్రతిష్ఠించి పూజించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నాం. అయితే చవితి రోజున వినాయక చవితి విగ్రహాంను ఏ సమయంలో పూజ మందిరంలో పెట్టుకోవాలి, ఏ సమయంలో పూజను చేసుకోవాలని జ్యోతిష్య పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మరీ అవేంటో చూద్దాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. వినాయక చవితిని నాడు గణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఆ రోజు ఉదయం 11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో  ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో వీలు కాకపోతే మరలా సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించి వ్రత సంకల్పం చేసుకోవచ్చని తెలిపారు. కనుక చవతిరోజున ఆ సమయాల్లో గణపతి విగ్రహా ప్రతిష్ఠ చేసి భక్తి, శ్రద్ధలతో నియమ నిష్టలతో వినాయకుడిని పూజిస్తే.. అన్ని విఘ్నాలు తొలిగి శుభలే జరుగుతాయని పండితులు పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ఆ మహా గణపతి కి ఎరుపు రంగు వస్త్రాలంటే ఎంతో ఇష్టం కాబట్టి.. వినాయక చవితి రోజున ఆ రంగు వస్త్రాలు ధరించి పూజిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది శనివారం రోజున వినాయక చవితి వచ్చింది కనుక ఆ వారానికిక అధిపతి శనిశ్వరుడు, అందుకే ఆయనకు ఇష్టమైన నీలం రంగు దస్తులు ధరించి పూజించిన మంచిదని పండితులు చెబుతున్నారు. అందుకే వినాయక చవితి రోజు ఎరుపు, నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలిగి ఆ విఘ్నేశ్వరుడిని అనుగ్రహం భక్తులకు కలుగుతుందని తెలిపారు. మరీ, వినాయక చవితి రోజు ఏ సమయంలో విగ్రహా ప్రతిష్ఠను చేసి పూజ జరుపుకోవాలనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.