P Krishna
Vasant Panchami: వసంత పంచమి పండుగను భారత దేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు విద్యార్థులు సరస్వతి దేవిని పూజిస్తారు.
Vasant Panchami: వసంత పంచమి పండుగను భారత దేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు విద్యార్థులు సరస్వతి దేవిని పూజిస్తారు.
P Krishna
భారత దేశంలో వసంత పంచమి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మాఘమాసం వచ్చిన ఐదోరోజు వచ్చే శుభదినం వసంత పంచమి. శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో 2024, ఫిబ్రవరి 14వ తేదీన మాఘ మాస శుక్ల పక్ష పంచమి శ్రీ పంచమి అని పంచాంగ కర్తలు అంటున్నారు. ఉత్తరాదిన వసంత పంచమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటీ? వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఎందుకు పూజిస్తారు..? ఆ రోజు అందరూ పూజలో పసుపు వస్త్రాలు ఎందుకు ధరిస్తారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం..
మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి అని అంటారు. శ్రీ పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి పండుగ ప్రతి ఏడాది మాఘమాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు ముహూర్తంలో అమ్మవారిని ఆరాధించే శుభ సమయం. శారదాదేవికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం. వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభ్రదం అంటారు. పసుపు బట్టలు ధరించి అమ్మవారికి పుష్పాలంకరణ చేసి పూజ చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఇలా చేస్తే అమ్మవారు జ్ఞాన సంపదను ఇవ్వడమే కాదు.. కోరిన కోరికలు తీరుస్తుందని హిందువుల నమ్మకం.
శ్రీ పంచమి రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే ఉన్నతవిద్యావంతులవుతారని నమ్మకం. అందుకే తమ పిల్లలకి ఆరోజు అక్షరభ్యాసం చేయిస్తుంటారు తల్లిదండ్రులు. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో తెలపబడింది. జ్ఞానానికి ఆధిదేవత సరస్వతి దేవి, ఆమె జ్ఞాన స్వరూపిణి, విజ్ఞానం, శాస్త్రం, కళలు అన్నింటికి సరస్వతిదేవి అంశలుగా పెద్దలు భావిస్తుంటారు. తెలంగాణలో బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడికి ఎంతో మంది తమ పిల్లను తీసుకు వచ్చి అక్షరాభ్యసం, అన్న ప్రసాసనలు చేయిస్తుంటారు. అంతేకాదు ఈ రోజు ఇళ్లలోనే కాదు పాఠశాలలు, కాలేజీల్లో కూడా సరస్వతి మాత పూజ చేస్తుంటారు. ఉత్తరాదిన వసంత పంచమి వేడుక అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో సరస్వతి మాత విగ్రహాలకు మూడు రోజుల పూజ చేసి గోదావరి నదిలో కలుపుతారు. వసంత పంచమి రోజు ఉత్తరాదిన సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎలా ఎగురవేస్తారో.. అక్కడ శ్రీపంచమికి అలా పతంగులు ఎగురవేస్తుంటారు. మీ పిల్లలతో సరస్వతి మాత పూజ చేయిస్తే ఎన్నో శుభాలు జరుగుతాయి.