iDreamPost
android-app
ios-app

వరలక్ష్మీ వత్రం రోజున ఈ రంగు చీర ధరిస్తే.. సిరి సంపదలు కలిసి వస్తాయి

  • Published Aug 25, 2023 | 8:56 AM Updated Updated Aug 25, 2023 | 8:56 AM
  • Published Aug 25, 2023 | 8:56 AMUpdated Aug 25, 2023 | 8:56 AM
వరలక్ష్మీ వత్రం రోజున ఈ రంగు చీర ధరిస్తే.. సిరి సంపదలు కలిసి వస్తాయి

హిందూ మతంలో శ్రావణమాసానికి చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఇక శ్రావణమాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది.. వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఇక ఈ ఏడాది 2023లో వరలక్ష్మీ దేవి వ్రతం ఆగస్టు 25న వచ్చింది. పవిత్రమైన శ్రావణమాసంలో ఈ వరలక్ష్మీ దేవి పూజ చేస్తే కుటుంబంలో ఆరోగ్యం, శాంతి, విద్య, కీర్తి, ప్రతిష్టలు విలసిల్లుతాయి అని నమ్ముతారు. వరలక్ష్మీ దేవి అంటే.. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు స్వరూపంగా భావిస్తారు..

ఈ వ్రతాన్ని ఎక్కువగా పెళ్లైన ఆడవారే చేస్తారు. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున అష్టలక్ష్మీ దేవతలందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి.. ఆ రోజున ఏ రంగు చీర ధరిస్తే కలిసి వస్తుంది అంటే.. వరలక్ష్మీ వ్రతం రోజున.. స్థిరలగ్నమున్న సమయంలో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగతాయని పండితులు వివరిస్తున్నారు. ఇక జ్యోతిష్యశాస్తర ప్రకారం.. సింహలగ్నం, వృశ్చిక లగ్నం, కుంభ లగ్నం, వృషభ లగ్నం ఈ నాలుగింటిని స్థిర లగ్నాలు అంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున ఈ లగ్నాలు ఎప్పుడు ఉన్నాయో చూసి.. ఆ మేరకు వీలును బట్టి మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే కలిసి వస్తుంది అంటున్నారు పండితులు.

అలానే వరలక్ష్మీ వ్రతం రోజున.. బంగారపు రంగు చీర ధరిస్తే.. ఉత్తమ ఫలితాలు కలుగుతాయని తెలుపుతున్నారు. అలానే లక్ష్మీ దేవికి ఆకుపచ్చ వర్ణం, గులాబీ రంగు అన్న ఎంతో ఇష్టం.. కనుర ఆ రంగు చీర ధరించి.. పూజ చేసినా.. మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు. అలానే ఆవుపాలు, కొబ్బరి నీళ్లు, ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, వరి పిండితో చేసిన ముగ్గు అమ్మవారికి ప్రీతి పాత్రం. కనుక మీరు పూజ చేసే సమయంలో ఇవ్వన్ని ఉండేలా చూసుకుంటే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని తెలుపుతున్నారు పండితులు.