P Krishna
Varalakshmi Vratam 2024: భారత దేశంలో హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసం వచ్చిందంటే పండగలు, శుభకార్యాల సందడి మొదలవుతుంది. ఈ మాసంలో మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. నిత్యం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
Varalakshmi Vratam 2024: భారత దేశంలో హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసం వచ్చిందంటే పండగలు, శుభకార్యాల సందడి మొదలవుతుంది. ఈ మాసంలో మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. నిత్యం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
P Krishna
శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ‘వరలక్ష్మీ వ్రతం’ జరుపుకోవడం హిందూ ధర్మంలో అనాధిగా వస్తున్న ఆచారం. శ్రావణ మాసం మొదలైందంటే శుభ కార్యాల సీజన్ మొదలవుతుంది. వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ఇష్టమైన పర్వదినం.. ఆ రోజు వరాల తల్లి వరలక్ష్మీ అమ్మవారిని నిండుగా అలంకరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని.. ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయని నమ్మకం. వారు పట్టిందల్లా బంగారం అవుతుందని అంటారు. కుటుంబ భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో చేయాల్లో చేయాలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
భారత దేశంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం మహిళలు ఎంతో ఘనంగా ‘వరలక్ష్మి వ్రతం’ జరుపుకుంటారు. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య.. హిందూ మతం ప్రకారం ఈ పండగ ఎంతో విశిష్టమైనది. ఈ పూజలు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలలు ఎక్కువగా జరుపుకుంటారు.శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జరిగితే మహావిష్ణు, లక్ష్మీ దేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని విశ్వాసం.అందుకే శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అంతేకాదు ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలు చేస్తే సౌభాగ్యం మరింత బలంగా మారి పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రాలు చెబుతున్నాయి.
అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ దేవికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కన్నా వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన, పైగా ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ పవిత్ర పూజ చేస్తే విశేషల పలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అన్ని మాసాల్లో కన్నా శ్రావణ మాసం శివ కేశవులతో పాటు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మథనం జరిగినపుడు మొదట లక్ష్మీదేవి అవతరించిందని పురణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి నారాయణ స్వామి స్వరూపుడిగా లక్ష్మీ దేవిని ‘వరలక్షీ’గా భావించి వ్రతం చేస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు.
పెళ్లయిన ప్రతి మహిళ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతున్నారు. ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలో ఉండి ముత్తయిదువలకు వాయినాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. శ్రావణ మాసం మొదలైన రెండవ వారం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, తర్వాత శ్రావణ పౌర్ణమికి సరస్వతి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 16, 2024 శుక్రవారం రోజున ‘వరలక్ష్మీ వ్రతం’ జరుపుకోబోతున్నారు. ఆ రోజు ఏ సమయంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించాలో తెలుసుకుందాం.
సింహ లగ్న పూజ ముహూర్తం – ఉదయం 05:57 am నుంచి 08:14 am వరకు
వృశ్చిక రాశి పూజ ముహూర్తం (మధ్యాహ్నం) : 12:50 pm – 03:08 pm
కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) : 06:55 pm – 08:22 pm
వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్థరాత్రి) : 11:22 pm – 01-18 pm