SNP
Ugadi 2024 Panchangam Mithuna Rasi Phalalu in Telugu: క్రోధీ నామ సంవత్సరంలో తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. మరి ఈ ఏడాది మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
Ugadi 2024 Panchangam Mithuna Rasi Phalalu in Telugu: క్రోధీ నామ సంవత్సరంలో తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. మరి ఈ ఏడాది మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
SNP
తెలుగు సంవత్సరాది ఉగాది రానే వచ్చింది. ఏప్రిల్ 9(మంగళవారం) నుంచి క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది నాడు పండితులు, జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెబుతుంటారు. అందుకే ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఏడాది తమ జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. తమ జీవితంలో రాబోయే ఏడాదిలో ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో రాశి ఫలాల ఆధారంగా అంచనా వేసుకుంటారు. మరి ఈ క్రోధీ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి. వారి వృతి, వ్యాపార, వ్యక్తిగత జీవితాలపై రాశి ప్రభావం ఏ మేర ఉండబోతుందనే విషయంలో జ్యోతిష్య శాస్త్ర పండితులు వెల్లడించారు. మిథున రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బృహస్పతి వ్యయస్థానములో సంచరించుట చేత, శని భాగ్య స్థానములో సంచరించుట చేత, రాహువు దశమస్థానములో సంచరించుట చేత అలాగే కేతువు చతుర్ధ స్థానమునందు సంచరించుటచేత మిథన రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. మిథునరాశి వారికి దశమంలో రాహువు, వ్యయంలో గురుని ప్రభావంచేత ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అనుకోని పనుల వలన అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడుతాయి. మిథున రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువవుతాయి. చతుర్ధ స్థానంలో కేతువు ప్రభావంచేత కుటుంబములో కలతలు ఏర్పడుతాయి.ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలున్నాయి. దశమ స్థానంలో రాహువు ప్రభావంచేత ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయని, ఖర్చులు నియంత్రించుకోవాలని జోతిష్యశాస్త్ర పండితులు సూచిస్తున్నారు.
వ్యాపారస్తులకు ఈ ఏడాది ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. ఖర్చుల విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు వహించాల్సిందే. సినీరంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సినీ, మీడియా రంగంలో చేసే ప్రయత్నాలు, పెట్టుబడులు అనుకూలిస్తాయి. రైతాంగానికి కూడా మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయని పండితులు వెల్లడిస్తున్నారు. మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండనుంది. మీ సౌఖ్యాల కోసం, ఆనందాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథునరాశి వారు గృహ అవసరాల కోసం సామాన్లను, వాహనాలను అలాగే అలంకారప్రియ వస్తువులైనటువంటి బంగారం వంటి వాటి కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థం అనుకూల ఫలితాలు ఉన్నాయని జోతిష్యశాస్త్ర నిపుణులు అంటున్నారు.
మిథునరాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. దత్తాత్రేయుని పూజించాలి. గురువారం రోజు శనగలను నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం మంచిదని, బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం, విష్ణు సహస్ర నామం వంటివి పారాయణ చేయాలని, గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి, పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మిథున రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా మంచి జరిగనుంది. ప్రేమపరమైనటువంటి విషయాలు ఈ ఏడాది అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి కోసం ధనాన్ని అధికంగా ఖర్చుచేస్తారు. పెళ్లి కాని వారికి ఈ ఏడాది వివాహయోగం ఉంది. అలాగే భాగస్వామితో ఆనందంగా గడుపుతారని జోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.
మొత్తంగా చూసుకుంటే.. మిథున రాశి వారికి ఆర్థికపరంగా ఈ క్రోధీ నామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. వ్యయస్థానంలో గురుని ప్రభావం వలన ఖర్చులు, అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడే వారికి మాత్రం ఆరోగ్య విషయాల్లో ఖర్చులు అధికమగును. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మిథునరాశి వారు నవరత్నం పచ్చను ధరిస్తే మంచిదని జోతిష్య పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారాయణుడిని పూజిస్తే మంచిది.
ఇక మిథున రాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.