iDreamPost
android-app
ios-app

తొలి ఏకాదశి నాడు ఈ వత్రం చేస్తే.. శివకేశవుల అనుగ్రహం పక్కా !

Tholi Ekadashi Festival: ఆషాడంలో వ‌చ్చే ఏకాద‌శిని తొలి ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ పండగను హిందువులు తొలి పండుగ‌గా జ‌రుపుకోవ‌డం ఆచారంగా వస్తుంది. ఈ క్రమంలో ప్రజలు పూజలు నిర్వహిస్తుంటారు. మరికొందరు వ్రతాలు చేస్తుంటారు.

Tholi Ekadashi Festival: ఆషాడంలో వ‌చ్చే ఏకాద‌శిని తొలి ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ పండగను హిందువులు తొలి పండుగ‌గా జ‌రుపుకోవ‌డం ఆచారంగా వస్తుంది. ఈ క్రమంలో ప్రజలు పూజలు నిర్వహిస్తుంటారు. మరికొందరు వ్రతాలు చేస్తుంటారు.

తొలి ఏకాదశి నాడు ఈ వత్రం చేస్తే.. శివకేశవుల అనుగ్రహం పక్కా !

తొలి ఏకాదశి.. హిందువులకు అతి పవిత్రమైన రోజు. దీనినే దేవశయని అని కూడా అంటారు. పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండు సార్లు కలిపి 26సార్లు వస్తుంది. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి పండగను ఘనం జరుపుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 17వతేదీన ఏకాది పండగను జరపుకోనున్నారు. ఇక పండగ రోజు ఓ వ్రతం చేస్తే..ఇక శివకేశవులతో పాటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక అసలు తొలి ఏకాదశి స్టోరీ ఏమిటో, ఆ వ్రతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఆషాడంలో వ‌చ్చే ఏకాద‌శిని తొలి ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ పండుగకు శ‌య‌నైక ఏకాద‌శి, హరి వాస‌ర‌మ‌ని, పేలాల అని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. ఈ సమయంలోనే క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీమహా విష్టువు ఆషాఢమాసంలోని తొలి ఏకాదశినాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని పేర్కొంది. ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లి.. కార్తికమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణలు చెబుతున్నాయి. అందుకే శ్రీవారు నిద్రలోకి వెళ్లిన రోజును తొలి ఏకదశిగా జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగను హిందువులు తొలి పండుగ‌గా జ‌రుపుకోవ‌డం ఆచారంగా వస్తుంది. ఈ క్రమంలో ప్రజలు పూజలు నిర్వహిస్తుంటారు. మరికొందరు వ్రతాలు చేస్తుంటారు. అయితే సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన చాలా మంది లో ఉంటుంది.

కానీ ఏకాదశి నాడు చేసే వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు.  అంతేకాక ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఏకాదశి పండగను జరుపుకునేందుకు హిందువులు సిద్ధమయ్యారు. ఈ సారి జూలై 16 వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై.. జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకోవాలన కొందరు పడితులు చెబుతున్నారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శివకేశవుల అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా  పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని హరి వాసరమని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఇక ఏకదశి రోజు వ్రతం ఎలా చేయాలి అనే విషయం గురించి పండితులు కొన్ని కీలక విషయాలను తెలిపారు.  ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమిరోజు రాత్రి పూట ఆహారం తీసుకోకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లుపాలు తీసుకోవచ్చు. ఇక ఉపవాసం ఉండే వారు మరుసటి రోజు అంటే ఏకాదశిరోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. అనంతరం స్నానం, దైవారాధన, ఇతర పూజాలు యథావిధిగా నిర్వహించాలి. అనంతరం ఉదయం పూట అవకాశం ఉన్నవారు ఆలయాలను దర్శించాలి. అంతేకాక స్తోత్ర, పారాయణాలు చేయాలి.

ఇంకా కుదిరితే తప్పక గోపూజ చేయండం మంచిదని పండితులు చెబుతున్నారు. అలానే ఏకదశి నాడు రాత్రంతా జాగారణ చేస్తే మంచిది. వీలుకాకుంటే.. నిద్రకి ఉపక్రమించే వరకు హరి నామస్మరణ చేసుకోండి. ఇక ఏకాదశి మరుసటి రోజు స్నానాలు చేసి.. దేవతారాధన చేయాలి. అనంతరం ఇంట్లో ఎవరైనా అతిథి ఉంటే వెంటనే వారికి భోజనం పెట్టాలి. అనంతరం మీరు భోజనం చేయాలి. ఇంట్లో అతిథిలేని పక్షంలో.. బయట ఉంటే మూగ జీవాల కోసం ఇంటి బయట ఒక ముద్ద పెట్టిన తరువాత మనం భోజనాన్ని చేయాలి. తొలి ఏకాదశి  శివుడికి, అమ్మవారికి, వేంకటేశ్వరస్వామికి చాలా ప్రీతికరం. ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక.. సమస్యలు తీరి..సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి