54 ఏళ్ల తర్వాత నేడే సంపూర్ణ సూర్యగ్రహణం.. తేలిగ్గా తీసుకోకుండా ఇలా చేయండి!

Total Solar Eclipse 2024: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత నేడే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ వివరాలు..

Total Solar Eclipse 2024: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత నేడే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ వివరాలు..

హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాస్తవంగా అయితే.. వీటిని చెడుగా భావిస్తారు. రాహు, కేతువులు.. సూర్య, చంద్రులను మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం భూమి, సూర్యడు, చంద్రుడు ఒకే రేఖపైకి రావడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి అంటారు. సరే ఏది ఏమైనా మన దేశంలో మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక 2024 సంవత్సంరంలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 2024 సోమవారం నాడు ఏర్పడబోతుంది. 54 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఏర్పడబోతున్న తొలి సూర్యగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది అంటున్నారు పండితులు.

ఇక ఈ సూర్య గ్రహణం సంపూర్ణ గ్రహణం కావడం, చైత్ర నవరాత్రులకు ముందు ఏర్పడుతుండటంతో.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దీన్ని శుభప్రదంగా భావిస్తున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటలకు గ్రహణ కాలం ముగుస్తుంది. అదే అమెరికా కాలమానం ప్రకారం అయితే మధ్యాహ్నం 2:15 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 25 నిమిషాలుగా ఉంది. 54 ఏళ్ల తర్వాత ఇంత సుదీర్ఘ సమయం ఉండటం ఇదే తొలిసారి. గ్రహణం వల్ల దాదాపు 8 నిమిషాల పాటు భూమి మీద పూర్తిగా చీకట్లు కమ్ముకుంటాయి. భారతదేశంలో గ్రహణం కనిపించనప్పటికీ ఈ సూర్యగ్రహణం చాలా దేశాల్లో చూడవచ్చు. అయితే అమెరికాలోని ఉత్తర భాగంలో ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.

గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • సూర్యగ్రహణం సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు.
  • గ్రహణ సమయంలో ప్రసరించే హానికరమైన కిరణాల వల్ల ఆహారం కలుషితమై ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
  • అందువల్ల గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండండి.
  • సూర్యగ్రహణం సమయంలో పొరపాటున కూడా దేవుని విగ్రహాలు, చిత్రపటాలను తాకకూడదు, పూజించకూడదు.
  • ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసి ఉంటాయి.
  • సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ నేరుగా కళ్లతో చూడకూడదు.
  • టెలిస్కోప్, ప్రత్యేక సన్ గ్లాసెస్ సాయంతో చూడాలి.
  • గ్రహణ సమయంలో దేవుడి నామస్మరణ, మంత్రాలు జపించాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు.
  • సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  • గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
  • ఈ కాలంలో తులసి, రావి, మర్రి చెట్లను తాకకూడదు.

గ్రహణం విడిచిన తర్వాత..

  • గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  • స్నానం చేసి పూజ చేసుకోవాలి.
  • మీకు సాధ్యమైనంత వరకు దానం చేస్తే మంచిది అంటున్నారు పండితులు.

Show comments