iDreamPost
android-app
ios-app

Pongal: సంక్రాంతికి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కారణం?

  • Published Jan 05, 2024 | 7:06 PM Updated Updated Jan 05, 2024 | 7:06 PM

భారత దేశంలో జాతి,మత, కుల బేధాలు లేకుండా అంతా కలిసి మెలిసి జీవిస్తారు. ఇక్కడ ఉన్న ఒక్కో మతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అయితే, ముఖ్యంగా హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఇంటి ముందు ముగ్గు వేయడం. మరి దీని వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏమై ఉంటుంది.

భారత దేశంలో జాతి,మత, కుల బేధాలు లేకుండా అంతా కలిసి మెలిసి జీవిస్తారు. ఇక్కడ ఉన్న ఒక్కో మతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అయితే, ముఖ్యంగా హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఇంటి ముందు ముగ్గు వేయడం. మరి దీని వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏమై ఉంటుంది.

  • Published Jan 05, 2024 | 7:06 PMUpdated Jan 05, 2024 | 7:06 PM
Pongal: సంక్రాంతికి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కారణం?

హిందూ సంప్రదాయం అంతా ఒకే తాటిపై నడుస్తున్నా.. వారు నివశించే ప్రాంతాన్ని బట్టి , జీవించే విధానాన్ని బట్టి.. వారు పాటించే ఆచార వ్యవహారాలు, పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే, ఎవరి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా సరే.. వారి ఇళ్ల లోగిళ్ళలో వేసే ముగ్గుల విషయంలో మాత్రం అంతా ఒకటే. ఇప్పుడంటే అంతా అపార్ట్మెంట్ లు, ఇరుకు నివాసాల మధ్యన ప్రజలు నివశిస్తున్నారు. కానీ, ఒకప్పుడు అంతా విశాలమైన వాకిళ్లు ఉండేవి. కాబట్టి ప్రతి ఇంటి లోగిలి రోజుకు ఒక ముగ్గుతో నిండుగా కళకళలాడుతూ ఉండేది. పైగా పండుగ రోజుల్లో ఈ ముగ్గులను ఇంకా ప్రత్యేకంగా వేశేవారు. అందులోను హిందువులకు అతి పెద్ద పండగైనా సంక్రాంతి అంటే.. ఇంకా ప్రత్యేకంగా వీధులన్నీ ముస్తాబు అవుతాయి. మరి, ఈ ముగ్గుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం.

పండుగలలోనే అతి పెద్ద పండుగా ఏది అంటే సంక్రాంతి అనే అంటారు అందరు. మరి కొద్దీ రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ వాతావరణం కనిపించనుంది. ముఖ్యంగా పల్లెటూళ్ళు తమ సొంత గూళ్లకు చేరుకున్న జనంతో కళకళలాడబోతున్నాయి. అయితే, ఈ మూడు రోజుల పెద్ద పండుగ వెనుక ఎన్నో ఆచార వ్యవహారాలు, ఎప్పటినుంచో వస్తున్న కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి. వీటి అన్నిటిలోను ముఖ్యంగా ఆడవారికి ఎంతో ప్రత్యేకంగా నిలిచేది.. వారు ఇంటి ముందు అందంగా అలకరించే ముగ్గులు. ఇవి ప్రత్యేకం మాత్రమే కాదు అసలు పండుగ వాతావరణమే వీటితో మొదలవుతుంది. సంక్రాంతి నెల మొదలవ్వగానే అందరి లోగిళ్ళు పెద్ద పెద్ద ముగ్గులతో అందంగా ముస్తాబు అవుతాయి. పైగా భోగి , సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు వాటికీ సంబంధించిన ప్రత్యేక ముగ్గులు ఉంటాయి. భోగి రోజు భోగి కుండలు , సంక్రాంతి మరుసటి రోజు రథాన్ని వేస్తారు.

Sankranthi muggulu

అయితే, ఈ ముగ్గు వేయడం వెనుక ఓ చిన్న ఆంతర్యం దాగి ఉంది. పురాణాల ప్రకారం చూసినట్లయితే .. ఒక రాజుగారి కుమారుడు చనిపోయినప్పుడు, ఆ కుమారుడిని తిరిగి బ్రతికించాలని ఆ రాజు బ్రహ్మ దేవుడిని కోరుకుంటాడు. బ్రహ్మ దేవుడి అనుగ్రహం కోసం ఎన్నో రోజులు కఠోర దీక్షతో కూడిన తపస్సును చేస్తాడు. చివరికి అతను తపస్సుకు కనికరించి బ్రహ్మ దేవుడు ప్రత్యేక్షమవుతాడు. ఆ రాజు కోరికను తీర్చడానికి అంగీకరిస్తాడు. ఆ క్రమంలో అతని కుమారిని బొమ్మను నేలపై గీయమని బ్రహ్మ దేవుడు రాజుకు చెప్తాడు. అలానే రాజు కూడా అతని కుమారుని బొమ్మను గీస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ బొమ్మకు ప్రాణం పోస్తాడు. దీనితో చనిపోయిన ఆ రాజు కుమారుడు తిరిగి బ్రతుకుతాడు. ఇక అప్పటినుంచి ఇలా ముగ్గు వేయడం అదృష్టంగా, తమ కుటుంబానికి మంచి చేకూరుతుందనే నమ్మకంతో.. అందరూ తమ లోగిళ్ళలో ముగ్గులు వేస్తూ ఉండడం.. ఆచారంగా మారింది.

Sankranthi muggulu

కాగా, ఈ ముగ్గును వేసే విధానం వెనుక కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ముగ్గు వేసేటప్పుడు ముందుగా రెండు పెద్ద గీతలను గీస్తారు. ఇలా గీయడం వలన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందట. అలానే ముగ్గు వేసిన తర్వాత కూడా చుట్టూ నాలుగు వైపులా అడ్డ గీతలను గీస్తారు. ఇది శుభకార్యాల సందర్భంలో వేస్తారు. వాకిట్లోనే కాకుండా దేవుడు పీటలపై కూడా ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. అలానే దుష్ట శక్తులను తరిమే వేసే సమయంలో వేసే ముగ్గులు కూడా వేరే ఉంటాయి. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఏదేమైనా ఈ ముగ్గులను సంబోధించే భాష వేరైనా..దీని వెనుక ఉన్న భావం మాత్రం ఒక్కటే. మరి, లోగిళ్ళకు వన్నెలు అద్దె ముగ్గుల వెనుక ఉన్న ఆంతర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.