Dharani
Dharani
మన దేశంలో రాఖీ పండుగకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతకు మించిన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సోదరి, సోదరుల మధ్య అనుబంధానికి అద్దం పట్టే పండగ ఇది. సోదరి.. తన తమ్ముడు, అన్న చేతికి రాఖీ కడుతూ.. జీవితాంతం కష్షసుఖాల్లో తోడుగా ఉండమని హామీ కోరుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు.. జీవితాంతం తోడుగా ఉంటానని సోదరికి హామీ ఇస్తాడు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగు ఎప్పుడు జరుపుకోవాలనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది.. ఆగస్ట్ 30, 31 అన్న దాని మీద సందిగ్థత నెలకొని ఉంది. అంతేకాక.. ఏ సమయంలో రాఖీ కడితే మంచిది అనే దాని గురించి కూడా చర్చించుకుంటున్నారు. మరి దీని గురించి పండితులు ఏమంటున్నారంటే..
రాఖీ పండుగను ఆగస్ట్ 30, 31వ తేదీలలో జరుపుకోవచ్చు. కాకపోతే భద్రకాల్ సమయంలో రాఖీ కట్టకూడదు అంటున్నారు పండితులు. కనుక ఆగస్ట్ 30-31 మధ్య భద్రకాలం ఎప్పుడు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా.. ఆగస్ట్ 30 బుధవారం ఉదయం 10.13 నుంచి రాత్రి 8.57 వరకు భద్రకాల్ సమయం ఉంది. కనుక ఈ సమయంలో రాఖీ కట్టకూడదు అంటున్నారు పండితులు. భద్రకాల్ గడువు ముగిసిన తర్వాత అనగా.. ఆగస్ట్ 30, బుధవారం రాత్రి 8.57 గంటల తర్వాత నుంచి.. ఆగస్ట్ 31, గురువారం ఉదయం 7.46 మధ్య కాలంలో రాఖీ కడితే మంచిది అంటున్నారు పండితులు.
పురణాల ప్రకారం చూసుకుంటే.. భద్రను సూర్యుడి కుమార్తె, శని దేవుడి సోదరిగా భావిస్తారు. భద్ర పుట్టిన నాటి నుంచి శుభకార్యాలను అడుకునేది. అందుకే భద్ర కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించేవారు కాదు. అంతేకాక శూర్పణఖ.. భద్రకాలంలోనే తన అన్న రావణుడికి రాఖీ కట్టిందని.. ఆ తర్వాత అతడు మరణించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భద్ర సమయంలో రాఖీ కట్టడం మానేశారు. కనుక మీరు కూడా భద్ర సమయంలో కాకుండా.. అది ముగిశాక.. మీ సోదరులకు రాఖీ కడితే మంచిది అంటున్నారు పండితులు.