Rakhi Pournami 2024-Rules, Conditions For Remove It: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. ఎప్పుడు విప్పాలి.. నియమాలేంటి

Rakhi Pournami 2024: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. ఎప్పుడు విప్పాలి.. నియమాలేంటి

Rakhi Pournami 2024-Rules, Conditions: ఆగస్టు 19, సోమవారం నాడు రాఖీ పండుగ రాబోతుంది. మరి రాఖీ కట్టడానికి మాత్రమే కాక విప్పడానికి కూడా నియమాలుంటాయని మీకు తెలుసా.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Rakhi Pournami 2024-Rules, Conditions: ఆగస్టు 19, సోమవారం నాడు రాఖీ పండుగ రాబోతుంది. మరి రాఖీ కట్టడానికి మాత్రమే కాక విప్పడానికి కూడా నియమాలుంటాయని మీకు తెలుసా.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకుంటారు. సోదరికి జీవితాంతం తోడుగా ఉంటానని సోదరుడు భరోసా కల్పించడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. పురాణాలు, చరిత్రలో కూడా ఈ పండుగకి చాలా ప్రాధాన్యత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ పండుగ, రక్షా బంధన్, రాఖీ పౌర్ణమి ఏ పేరుతో పిలిచిన పండగ ఉద్దేశం మాత్రం ఒక్కటే.. సోదరీసోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలవడమే. ఇక ఈ ఏడాది ఆగస్టు 19, సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చింది.

ఎక్కడెక్కడో ఉన్న అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టడానికి సొంత ఊళ్లకు వెళ్తారు. తమ సోదరులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. సోదరీమణులు రాఖీ కడతారు. తమ క్షేమం కోసం రక్ష కట్టిన అక్కాచెల్లెళ్లకు కృతజ్ఞత తెలియజేస్తూ, అన్నదమ్ములు వారికి చేతనైనంతలో బహుమతులు అందిస్తారు.

రాఖీ ఎప్పుడు కట్టాలంటే..

ఈ సంవత్సరం, రాఖీ పండుగ ఆగస్టు 19, సోమవారం నాడు వస్తోంది. ఆరోజు పౌర్ణమి తెల్లవారుఝామున గం. 3.06ని.లకు ప్రారంభమై, రాత్రి 11.56 ని.లకు ముగుస్తుంది. రక్షబంధన్​కు అనుబంధంగా ఎప్పుడూ భద్రకాలం ఉంటుంది. ఇది శుభసమయం కాదు. అంటే ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిశాకే కట్టాలి. ఇక ఈ ఏడాది భద్రకాలం సోమవారం మధ్యాహ్నం 1.30 గం.ల వరకు ఉంటోందని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. కాబట్టి ఆ తర్వాతే రాఖీ కట్టడం శుభప్రదం అంటున్నారు.

రాఖీ ఎప్పుడు విప్పాలంటే…

రాఖీ కట్టించుకున్న తర్వాత చాలా మంది అబ్బాయిలు దాన్ని రెండు, మూడు రోజులుంచుకుని.. ఆ తర్వాత తీస్తి ఎక్కడంటే అక్కడ పడేస్తారు. కానీ అలా చేయకూడదు అంటున్నారు పండితులు. రాఖీ కట్టించుకోవడానికి శుభ ముహుర్తం ఎలా పాటిస్తామో.. అలానే రక్షను విప్పడానికి కూడా శుభముహుర్తం పాటించాలని చెబుతున్నారు. రాఖీ విప్పడం గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే.. రాఖీ కట్టించుకున్న తర్వాత దాన్ని 1, 2 రోజుల తర్వాత తీసేయకూడదు. రాఖీని కనీసం 21 రోజులు చేతికి ఉంచుకోవాలి. అన్ని రోజులు కుదరకపోతే.. కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి (26 ఆగస్టు) వరకు అయినా ఉంచుకోవాలి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎక్కడా పడేయకుండా ఎర్రటి వస్త్రంలో చుట్టి ఏదైనా పవిత్ర స్థలంలో, మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచండి. మళ్లీ వచ్చే రాఖీ పండగ వరకు దాన్ని భద్రపర్చాలి. ా తర్వాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని iDream Media నిర్ధారించలేదు. పురాణాలు, జ్యోతిష్యశాస్త్ర పండితుల ప్రవచానాలననుసరించి ఇవ్వబడ్డాయి.

Show comments