iDreamPost
android-app
ios-app

పుష్ప-2 థీమ్ తో వినాయకుని విగ్రహాలు.. నెటిజన్ల ఆగ్రహం

  • Published Sep 06, 2024 | 11:01 AM Updated Updated Sep 06, 2024 | 11:13 AM

Pushpa-2 Theme Ganesh Idol: వినాయక చవితికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో.. షాపులు , మార్కెట్ లో సందడి సందడిగా ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్ లో గణేష్ విగ్రహాలు రకరకాల స్టైల్ లో తయారు చేస్తున్నారు. తాజాగా పుష్ప సినిమా స్టైల్ లో వచ్చిన వినాయకుడు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pushpa-2 Theme Ganesh Idol: వినాయక చవితికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో.. షాపులు , మార్కెట్ లో సందడి సందడిగా ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్ లో గణేష్ విగ్రహాలు రకరకాల స్టైల్ లో తయారు చేస్తున్నారు. తాజాగా పుష్ప సినిమా స్టైల్ లో వచ్చిన వినాయకుడు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Sep 06, 2024 | 11:01 AMUpdated Sep 06, 2024 | 11:13 AM
పుష్ప-2 థీమ్ తో వినాయకుని విగ్రహాలు.. నెటిజన్ల ఆగ్రహం

వినాయక చవితి పండుగ వస్తుందంటే… ప్రతి వీధిలోనూ వారం నుంచే హడావిడి స్టార్ట్ అయిపోతుంది .. గణేష్ మండపాలు , విగ్రహాలతో ఇల్లు వీధులు సందడిగా ఉంటాయి. ఒకప్పుడు వినాయక చవితికి విగ్రహాలను మట్టితో మాత్రమే నిండైన రూపంతో తయారు చేసి అమ్మేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ లో రకరకాల రూపాలతో పోటా పోటీగా గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే ఏకంగా ఏ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సినిమా స్టైల్ లో విగ్రహాలను తయారు చేసి మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి వినాయక చవితికి మార్కెట్ లోకి పుష్ప థీమ్ తో గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

ప్రస్తుతం మూవీస్ లో పుష్ప-2 మీద ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఇటీవల ఆ సినిమా నుంచి అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ సాంగ్ కు .. ఎలాంటి క్రేజ్ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద రీల్స్ , మీమ్స్ కూడా బాగానే నడిచాయి. అదంతా ఫ్యాన్స్ సినిమాపైన చూపించే అభిమానం. అయితే ఆ అభిమానం అక్కడైతే ఆగిపోతే బాగానే ఉండేది.. కానీ ఇప్పుడు హద్దులు దాటి భక్తి అనే పేరు జోడించి.. సేమ్ పుష్ప 2 సినిమాలోని పుష్ప-శ్రీవల్లి పాత్రలతో.. ఆ పాటలో కనిపించిన సేమ్ ఔట్ ఫిట్ తో గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీనితో భక్తులు వీటిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇష్టం, అభిమానం కాస్తా హద్దులు దాటితే… పిచ్చి, వెర్రి , పైత్యం అంటారని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. ఇకనైనా సినిమాలు , క్రికెట్ ల మీద అభిమానంతో ఆ తరహాలో చేయడం మానేసి.. వీలైనంత ఎక్కువగా మట్టి గణేష్ విగ్రహాలను చేయాలనీ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా నెటిజన్లు వాపోయే దానిలో నిజం లేకపోలేదు. సినిమాపై.. నటి నటులపై ఉన్న అభిమానాన్ని అంత వరకే ఉంచి… ఎప్పటినుంచో ఉన్న ఆచారాలను అలాగే కొనసాగించడం మంచిది. మరి ఇకనుంచైనా విగ్రహాలు తయారు చేసే విషయంలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. ఇక ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలకు పల్లెలు , పట్టణాలు సర్వం సిద్ధం అవుతున్నాయి. మరి ఈసారి పండుగ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి. మరి పుష్ప థీమ్ తో గణేష్ విగ్రహాలను తయారు చేయడం పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.