Dharani
కార్తీకమాసంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఇక కార్తీక మాసంలో అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాలలు ధరిస్తారు చాలా మంది. ఈ క్రమంలో భక్తులు ఎక్కువగా వినే మణికంఠుడి పాటల వివరాల మీకోసం..
కార్తీకమాసంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఇక కార్తీక మాసంలో అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాలలు ధరిస్తారు చాలా మంది. ఈ క్రమంలో భక్తులు ఎక్కువగా వినే మణికంఠుడి పాటల వివరాల మీకోసం..
Dharani
హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది మాత్రమే కాక.. పరమ పవిత్రంగా భావిస్తారు. శివుడు, విష్ణువులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ఆలయాలన్ని దేదీప్యమానంగా వెలిగి పోతాయి. ఇక కార్తీక మాసం ప్రారంభం అయ్యిందంటే చాలు.. మాలధారణ మొదలు పెడతారు. అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాలలు వేస్తారు అనేక మంది. 41 రోజుల పాటు కఠిన నియమాలతో, ఒంటి పూట భోజనం చేస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ.. చన్నీటి స్నానం చేసి.. కటిక నేల మీద పడుకుని.. దైవ స్మరణలో గడుపుతారు. ఇక ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాల వేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఇక ఈ మాసంలో అయ్యప్ప స్వామి ఆలయాలు, మాలధారణ చేసిన వారి ఇళ్లల్లో హరిహరసుతుని పాటలు మారుమోగిపోతాయి. ఇక మన దగ్గర అయ్యప్ప స్వామి భక్తి పాటలు అనగానే ముందుకు అందరికి గుర్తుకు వచ్చే పాటలు కొన్ని ఉన్నాయి. వాటి వివరాలు మీకోసం..
గాయకుడు కే జేసుదాసు గాత్రం నుంచి వెలువడిన ఈ పాట వింటే.. మణికంఠుని సన్నిదానంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు.
అయ్యప్ప స్వామి భక్తి పాటలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే భజన పాట ఇరుముడికట్టు శబరిమలక్కు. వాస్తవంగా ఈ పాట తమిళంలో ఉంటుంది. కానీ భగవంతుడికి భక్తి ముఖ్యం.. భాషతో సంబంధం లేదన్నట్లుగా ఈ పాట ఎంతో ఫేమస్ అయ్యింది. తర్వాత తెలుగులో కూడా వచ్చింది.
ఇక మణికంఠుడి పాటలు అనగానే గుర్తుకు వచ్చే మరో పాట.. ఓంకార రూపాన.. శబరిమల శిఖరాన. ఈ పాటను పాడింది కూడా జేసుదాసే. మాలధారణ ప్రత్యేకత, మహిమల గురించి వివరిస్తూ సాగే ఈ పాట కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆవిడే శ్యామల సినిమాలోని ఈ పాట ప్రతి అయ్యప్ప ఆలయం, పూజ దగ్గర కచ్చితంగా వినిపిస్తుంది.
అయ్యప్ప స్వామి మహత్యాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన చిత్రం అయ్యప్ప స్వామి మహత్యం. శరత్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఓం ఓం అయ్యప్ప.. ఓంకార రూప అయ్యప్ప పాట కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
మణికంఠుడి భజన గీతాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భగవాన్ శరణం.. భగవతి శరణం. అయ్యాప్ప స్వామికి నిర్వహించే ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాల్లో కచ్చితంగా ఈ పాట వినిపిస్తుంది.
అయ్యప్ప స్వామి భజన గీతాల్లో ఈ పాట కూడా ఎంతో ఫేమస్. మాలధారణ సమయంలో అయ్యప్పలు చేసే పనులు, స్వామికి నిర్వహించే పూజలు, అభిషేకాల గురించి ఈ పాటలో వర్ణించారు.
దేవుళ్లు చిత్రంలోని ఈ పాట కూడా అయ్యప్ప గొప్పతనాన్ని.. భక్తులను ఆయన ఎలా అక్కున చేర్చుకుంటారో వివరిస్తుంది. దీన్ని పాడింది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట వింటే నిజంగానే అయ్యప్ప మన ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది.
ఈమధ్య కాలంలో జానపద గేయాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ కి క్రేజ్ ఎక్కువగా ఉంది. వీటిల్లో ఆధ్యాత్మిక పాటలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చిన వాటిల్లో మల్లెపూల పల్లకి… బంగారు పల్లకి అనే పాట కూడా బాగా ఫేమస్ అయ్యింది.
అయ్యప్ప భక్తి పాటాల్లో బాగా ఫేమస్ అయిన వాటిల్లో ఇది కూడా ఒకటి. అయ్యప్ప కొలువైన పంబా తీరం, పందల రాజ్యం గురించి వర్ణిస్తూ సాగే ఈ పాట కూడా భక్తుల నోళ్ళల్లో నానుతుంది.
ఇక అయ్యప్ప పూజల్లో తప్పకుండా వినిపించేది.. ప్రతి అయ్యప్ప మాలధారుడు నిత్యం పఠించేది అయ్యప్ప శరణు ఘోష. అయ్యప్ప పూజ సమయంలో కచ్చితంగా ఈ శరణు ఘోష వినిపిస్తుంది. స్వామియే అయ్యప్పో.. అంటూ భక్తిపారవశ్యంలో తేలిపోతూ.. మాలధారులతో పాటు సామాన్యులు కూడా ఆయన భజనలో పాల్గొంటారు. మరి ఇక్కడ పేర్కొన్న అయ్యప్ప పాటల్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.