Keerthi
Vinayaka Chavithi 2024: ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ వినాయక చవితిని రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఆ పర్వదినం నాడు విఘ్నేశ్వరుడిని ప్రతిఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారుంటారు.అయితే ఆరోజున ఈ ప్రత్యేకమైన పూజలో ఈ విషయాలను అసలు మరిచిపోవద్దని పురోహితులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vinayaka Chavithi 2024: ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ వినాయక చవితిని రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఆ పర్వదినం నాడు విఘ్నేశ్వరుడిని ప్రతిఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారుంటారు.అయితే ఆరోజున ఈ ప్రత్యేకమైన పూజలో ఈ విషయాలను అసలు మరిచిపోవద్దని పురోహితులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
కోట్లాది మంది హిందువులకు ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. అయితే ఈ పండుగను శివపర్వతులు కుమారుడైన మహా గణపతి పుట్టినరోజు నాడు జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగను జరుపుకోవడం కోసం చిన్న నుంచి పెద్ద వరకు మూడు నెలల ముందు నుంచే హడావిడి ప్రారంభిస్తారు. ముఖ్యంగా గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి వీధిలో అత్యంత ఘనంగా వినాయక మండపాలు సిద్ధం చేసి ఆ విఘ్నేశ్వరుని విగ్రహాలు ప్రతిష్ఠిస్తుంటారు. అయితే ప్రతి ఏడాది ఈ వినాయక చవితని భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు.
ఇక ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ వినాయక చవితిని రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఆ పర్వదినం నాడు విఘ్నేశ్వరుడిని ప్రతిఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారుంటారు.అయితే ఆరోజున ఈ ప్రత్యేకమైన పూజలో ఈ విషయాలను అసలు మరిచిపోవద్దని పురోహితులు చెబుతున్నారు. మరీ ఆ విశేషలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందు దేవుళ్లలో మొట్ట మొదటి పూజలందుకున్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన దేవుడు శ్రీ మహా గణపతి. అయితే ఈ గణపతి మహోత్సవాలు రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఇక ఈ పవిత్రమైన రోజున ఇళ్లలోని, ఆలయాల్లోని వీధుల్లోని ఆ విఘ్నేశ్వరుని ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆ మహా గణేశుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో అన్ని విజయాలు, సిరి సంపదలు పెరుగుతాయని చాలామంది బలంగా నమ్ముతారు. మరీ, ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నందుకు ఈ గణేష్ చతుర్ధి రోజున ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు.
ఇంతకీ అదేమిటంటే..ఒక మట్టి ప్రమిదిలో కొబ్బరినూనే పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే.. ఆ గణనాథుడి డి సంపూర్ణ అనుగ్రహం అందరీపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఒకవేళ 21 పత్రాలతో పాటు అందులో ఒకటైన ఈ జిల్లేడు పత్రాలతో పూజించడం వీలుకాని వారు.. ఒక గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పించినా అంతే ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వినాయక చవితి పండుగను ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకుంటారనే విషయం తెలిసిందే. అయితే ఆ పర్వదినం రోజున గణపతి విగ్ర హ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఆ రోజు ఉదయం 11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో వీలు కాకపోతే మరలా సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించి వ్రత సంకల్పం చేసుకోవచ్చని తెలిపారు. కనుక ఆ రోజున ప్రతిఒక్కరు వేద పండితులు చెప్పిన ఈ జిల్లేడు ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ మహా గణపతి అనుగ్రహాన్ని పొందండి.