iDreamPost
android-app
ios-app

శివరాత్రి నాడు శివుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? పూజా విధానం తెలుసుకోండి..

  • Published Mar 08, 2024 | 9:26 AM Updated Updated Mar 08, 2024 | 9:26 AM

మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను ప్రసన్నం చేసుకోవాలని భక్తులు అందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ మహాదేవుడ్ని ఎలా ఆరాధించాలి? శివరాత్రి పూజా విధానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను ప్రసన్నం చేసుకోవాలని భక్తులు అందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ మహాదేవుడ్ని ఎలా ఆరాధించాలి? శివరాత్రి పూజా విధానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 08, 2024 | 9:26 AMUpdated Mar 08, 2024 | 9:26 AM
శివరాత్రి నాడు శివుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? పూజా విధానం తెలుసుకోండి..

మహా శివరాత్రిని హిందువులు అత్యంత పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన శివయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇవాళ మహాదేవుడి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి నాడు శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పర్వదినాన శివుడ్ని ఆరాధిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పురాణాల ప్రకారం శివరాత్రి నాడు శివ భక్తులంతా శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి అభిషేకం చేస్తారు. ఏడాది పొడవునా ఆరాధించినా రాని ఫలితం ఇవాళ ఒక్క రోజు ఆరాధిస్తే వస్తుందని పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో శివరాత్రి పూజా విధానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

శివరాత్రి పూజా విధానం

  • మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండే భక్తులు రోజంతా శివ మంత్రం (ఓం నమః శివాయ) పఠించాలి. రోగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు పగటిపూట పండ్లు తీసుకొని రాత్రి పూజ చేయొచ్చు.
  • శివరాత్రి ఉపవాసం ఉన్నవారు రాత్రిపూట నాలుగు గంటల పాటు మహాదేవుడ్ని పువ్వులు, పండ్లు, చందనం, బిల్వ పత్రాలు, ధాతుర, ధూపదీపాలతో పూజించాలి.
  • ఇవాళ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారను కలిపి పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత నీటితో అభిషేకం చేయాలి.
  • శివరాత్రి నాడు నాలుగు ప్రహర్లను పూజించే టైమ్​లో శివపంచాక్షర మంత్రాన్ని అనగా ఓం నమః శివాయను జపించాలి.
  • భవ, శర్వ, రుద్ర, పశుపతి, ఉగ్ర, మహాన్, భీముడు, ఈశానుడు అనే 8 పేర్లతో పుష్పాలను శివుడికి సమర్పించాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి.
  • శివపురాణంలో రాత్రిపూట మహాదేవుడ్ని పూజించాలనే నిబంధన ఉంది. కాబట్టి శివరాత్రి నాడు సాయంత్రం స్నానం చేసి శివాలయానికి లేదా ఇంటికి వెళ్లి, తూర్పు లేదా ఉత్తర ముఖంగా త్రిపుండ్, రుద్రాక్షను ధరించి ఈ కింది మంత్రాన్ని జపించాలి.
    ‘మామాఖిల్పపక్షయపూర్వా సలాభీష్టసిద్ధయే శివప్రీత్యర్థం చ శివపూజామః కరిష్యే’.

ఇదీ చదవండి: శివరాత్రికి తొలిసారి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి!