P Krishna
Hanuman is The Doctor in Temple: భారత దేశంలో హిందువులు ఎంతో భక్తితో కొలిచే దేవుడు హనుమంతుడు. దెయ్యాలు, భూతాలు, పీడకలలు, దీర్ఘకాలిక రోగాలు నయం కావాలని ఆంజనేయస్వామి గుడిలో నిద్రిస్తుంటారు.
Hanuman is The Doctor in Temple: భారత దేశంలో హిందువులు ఎంతో భక్తితో కొలిచే దేవుడు హనుమంతుడు. దెయ్యాలు, భూతాలు, పీడకలలు, దీర్ఘకాలిక రోగాలు నయం కావాలని ఆంజనేయస్వామి గుడిలో నిద్రిస్తుంటారు.
P Krishna
దేశం టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ది సాధించింది. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. మంత్రాలు, చేతబడులు అంటూ దొంగస్వాములు అమాయ ప్రజలను దోచుకుంటున్నారు. మానసిక, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిని నయం చేస్తామని మాయమాటలు చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఇలాంటి వారి చేతుల్లో మోసపోతూ ప్రజలు చనిపోతుంటారు. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చిందంటే కోలుకోలేరు.. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా తగ్గడం కష్టం. కానీ గుడిలో మాత్రం ఎలాంటి క్యాన్సర్ అయినా ఇట్టే తగ్గిపోతుంది. ఇంతకీ ఆ గుడి ఎక్కడ ఉంది..? ఆ డాక్టర్ ఎవరో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
భారత దేశంలో దాదాపు ప్రతి గ్రామంలో హనుమాన్ గుడి తప్పకుండా ఉంటుంది. దుష్ట శక్తుల నుంచి తమ గ్రామాన్ని రక్షిస్తారని ప్రతి గ్రామంలో హనుమంతుడి గుడి కట్టి పూజిస్తుంటారు. ఎప్పడు భయం అనిపించినా.. జై హనుమాన్ అని తల్చుకుంటే చాలు ఎంతో ధైర్యం వస్తుంది.. అంత పవర్ ఫుల్ దేవుడు అని ప్రజలు విశ్వసిస్తారు. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి అంటే చావుకు దగ్గరైనట్లు భావిస్తుంటారు. ఎన్ని మందులు వాడినా, ఆస్పత్రులకు తిరిగినా క్యాన్సర్ వ్యాధి నయం కావడం చాలా కష్టం. కానీ మధ్యప్రదేశ్ లోని ఓ గుడికి వెళ్తే మాత్రం ఎలాంటి క్యాన్సర్ అయినా తగ్గిపోతుంది.. అక్కడ డాక్టర్ మరెవరో కాదు.. ఆంజనేయ స్వామి. అందుకే ఆ గుడిని హనుమాన్ క్లీనిక్ అని పిలుస్తారు భక్తులు. అక్కడ రోగులను సాక్షాత్తు భజరంగ భలి వచ్చి వైద్యం చేస్తారని చెబుతుంటారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీండ్ లో దాండ్రువా ధామ్ పేరుతో ఓ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. నిత్యం ఎంతోమంది ప్రజలు ఈ గుడిని సందర్శించడానికి వస్తుంటారు. ఇక్కడ హనుమాన్ ని డాక్టర్ భజరంగి బలిగా పిలుస్తుంటారు. ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే.. ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా ఇట్టే మాయమైపోతాయని ఆలయ పూజారులు చెబుతుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని వెంటనే తగ్గిస్తుందని భక్తులు చెబుతుంటారు. అందుకే దండ్రువా ధామ్‌కి వచ్చి స్వామి వారిని దర్శంచుకొని ఆయన పాదాల వద్ద ఉన్న నీళ్లను తీసుకువెళ్తుంటారు. ఈ నీటిని తాగితే సకల రోగాలు మాయమైతాయని..ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులు తగ్గుతాయని అంటారు. రోగులకు ఇక్కడ స్వయంగా హనుమన్ జీ వైద్యం చేస్తాడని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ భజరంగ భలి అన్ని రోగాలను నయం చేస్తారని అంటారు. వరుసగా ఐదు మంగళవారాలు హన్‌మాన్ దగ్గర ధ్యానం చేసి.. ఇక్కడ నీళ్లు తాగితే క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందని పూజారులు అంటున్నానరు. గతంలో హనుమంతుడు స్వయంగా తన భక్తుడికి వైద్యం చేయడానికి ఇక్కడికి డాక్టర్ రూపంలో వచ్చాడని చెబుతుంటారు. అందుకే స్వామి వారిని డాక్టర్ అని పిలుస్తుంటారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.