iDreamPost
android-app
ios-app

ముత్యాలమ్మ గుడిలో ఒంటికాలిపై మహిళా అఘోరీ పూజలు..!

  • Published Oct 18, 2024 | 2:01 PM Updated Updated Oct 18, 2024 | 2:54 PM

Lady Aghori Worshiping: సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిలో గుర్తు దుండగులు ఎంతో పవిత్రంగా కొలిచే అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసి బయటపడేశారు. ఈ దారుణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలోనే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Lady Aghori Worshiping: సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిలో గుర్తు దుండగులు ఎంతో పవిత్రంగా కొలిచే అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసి బయటపడేశారు. ఈ దారుణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలోనే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముత్యాలమ్మ గుడిలో ఒంటికాలిపై మహిళా అఘోరీ పూజలు..!

మొన్నటి వరకు దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించుకున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే అక్టోబర్ 13న సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కుమ్మరిగూడలో జరిగిన ఘటనపై హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అమ్మవారి విగ్రమం ధ్వంసం చేసి పారిపోతున్న దుండగుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ముత్యాలమ్మ గుడిలో ఓ మహిళా అఘోరా పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సికింద్రబాద్ పరిధిలోని మోండా మార్కెట్ లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో గురువారం (అక్టోబర్ 17) న శాంతి, చండీ హూమం పూర్ణాహుతి జరిపించారు. ఆ సమయంలో ముత్యాలమ్మ గుడి వద్ద అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పూజలు జరుగుతున్న సమయంలో ఆలయంలోకి ఓ మహిళా అఘోరి (నాగసాధు) వచ్చింది. మొదట ఆమె రూపాన్ని చూసిన భక్తులు ఆశ్చపోయారు.. తర్వాత సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్లు భావించి నీళ్ళు సాక పోశారు. నగ్నంగా ఉన్న ఆ మహిళా అఘోరి హూమంలో పాల్గొని, ఒంటి కాలిపై నిలబడి పూజలు చేసింది. పూజలు చేస్తున్న సమయంలో   చేతులతో పలు ముద్రలు చూపిస్తూ.. భస్మాన్ని హూమ గుండంలో వేస్తూ మంత్రాలు జపించింది. మహిళా సాధువు వచ్చి పాప ప్రక్షాళన చేసినట్లు భక్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ముత్యాలమ్మ గుడిలో అక్టోబర్ 13న దుండగులు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఓ మహిళా అఘోరి కారులో వచ్చి పూజలు నిర్వహించింది. ఆమెను చూసి మొదట భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత ఆమె చేసిన పూజలు చూసి భక్తితో పరవశించిపోయారు. ఆ మహిళ పురుషుల మాదిరిగానే దిగంబరురాలిగా ఉండటం.. ఒళ్ళంతా విభూది, మెడ,చేతులకు రుద్రాక్షల మాల ధరించి, చేతిలో త్రిషూంతో శివరూపంలో కనిపించింది.