నవంబరు 9 నుంచి ఎన్టీవీ – భక్తి టీవీ కోటి దీపాల పండుగ.. సర్వం సిద్ధం

Koti Dipotsavam 2024: ప్రతి ఏడాది ఎన్టీవీ - భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ఈ కోటి దీపోత్సవంను 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు.

Koti Dipotsavam 2024: ప్రతి ఏడాది ఎన్టీవీ - భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ఈ కోటి దీపోత్సవంను 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు.

కార్తీక మాసం వచ్చిందంటే చాలు హిందూ దేవాలయాలు భక్తులతో కిట కిటలాడుతుంటాయి. ఈ మాసంలో వెలిగే ప్రతి దీపం మంగళప్రదం అంటారు. అలాంటిది ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేల సంఖ్యలో భక్తులు ఒకేచోట చేరి.. దీపాలు వెలిగిస్తే.. అది దీపయజ్ఞం అవుతుంది. ప్రతి ఏడాది ఎన్టీవీ – భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ఈ కోటి దీపోత్సవంను 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు. నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 17 రోజుల పాటు ఈ కోటి దీపోత్సవం మహా వైభవంగా జరగనుంది. నవంబర్ 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ కోటి దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది.

దీపోత్సవం సమయంలో స్టేడియం మొత్తం కైలాసంగా మారిపోతుంది. భక్తులు శివధ్యానంతో పరవశించిపోతారు. ప్రవచనంతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణ మహోత్సవాలు, నీరాజనాలతో ఈ కోటి దీపోత్సవంలో భక్తులు పులకించిపోతారు. ఇక ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కోటి దీపోత్సవంలో ఓ మహాజ్వల ఘట్టం అనే చెప్పాలి. ఈ కోటి దీపోత్సవంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవాతామూర్తులను చూసి భక్త కోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కనువిందు చేయనుంది. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాదు కూర్చున్న చోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని కనులారా వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా రుద్రాక్షలు, భస్మంతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా నిర్వాహకులే కల్పిస్తూ ఉండటం గమనార్హం.

అదే విధంగా దేవతల కల్యాణాన్ని చేయించినా, వీక్షించినా మహా పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ఆ భగవంతుడిని ధ్యానించడం వల్ల పలు సమస్యలు దూరం అవుతాయని అంటారు. ఏడాదిలో శుభ మాసాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత విశిష్టమైనదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చన్నీటి స్నానం, దానం, జపాలకు అత్యంత విశేష ఫలితం ఉంటుందని అంటారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది.  కార్తీక మాసంలో భక్తితో  ఈ రెండు అదృష్టాలు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు ఒకే వేదికపై శివకేశవులను కోటి దీపాల మధ్య దర్శించుకునే మహా యోగమే కోటి దీపోత్సవం అని చెప్పవచ్చు. ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, వెలుగులీనే దీపాంతపులతో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కోటి దీపోత్సవం నవంబర్ 9 నుంచి మొదలై నవంబర్ 25 వరకు జరగనుంది. ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఈ క్రతువు మొదలుకానుంది. దీనికి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికైంది.

Show comments