iDreamPost
android-app
ios-app

Holi 2024: అక్కడ బూడిదతో ఘనంగా హోలీ వేడుక! ఈ ఒక్క దగ్గరే ఇలా ఎందుకంటే?

  • Published Mar 23, 2024 | 2:28 PM Updated Updated Mar 23, 2024 | 2:28 PM

హోలీ అంటే రంగుల పండుగ .. ఎక్కువగా చిన్నపిల్లలు , యూత్ ఈ హోలీ ఫెస్టివల్ ను జరుపుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు. అయితే, హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణాలు, ఇతిహాసాల ప్రకారం చాల కథనాలు ఉన్నాయి. ఓ ప్రాంతంలో అయితే, హోలీని కేవలం బూడిదతోనే జరుపుకుంటారంట.

హోలీ అంటే రంగుల పండుగ .. ఎక్కువగా చిన్నపిల్లలు , యూత్ ఈ హోలీ ఫెస్టివల్ ను జరుపుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు. అయితే, హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణాలు, ఇతిహాసాల ప్రకారం చాల కథనాలు ఉన్నాయి. ఓ ప్రాంతంలో అయితే, హోలీని కేవలం బూడిదతోనే జరుపుకుంటారంట.

  • Published Mar 23, 2024 | 2:28 PMUpdated Mar 23, 2024 | 2:28 PM
Holi 2024: అక్కడ బూడిదతో ఘనంగా హోలీ వేడుక! ఈ ఒక్క దగ్గరే ఇలా ఎందుకంటే?

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హోలీ పండుగా రానే వచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది మార్చి 25న హోలీ పండుగ వచ్చింది. అదే సమయంలో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. దీనితో ఈసారి జరుపుకోబోయే హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణాలు, ఇతిహాసాలతో కూడిన ఎన్నో కథనాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శివ పార్వతుల వివాహం తర్వాత.. కాశీలో ఏకాదశి పర్వదినాన శివయ్య పార్వతి దేవితో కలిసి హోలీ పండుగను జరుపుకున్నారు. ఇక అప్పటినుంచి ఈ పండుగ ఆచారంగా వస్తూ ఉంది. అయితే, సాధారణంగా హోలీని వివిధ రకాల రంగులతో జరుపుకుంటూ ఉంటారు. కానీ, కాశీలో మాత్రం హోలీని బూడిదతో జరుపుకుంటారట. దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.

హోలీ సమయంలో.. కాశీలోని మణికర్ణికా ఘాట్ వద్ద, సాధువులందరూ సమావేశమై, శివ-భజన, ఆట పాటలతో ఘనంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. అక్కడ హోలీని రంగులతో కాకుండా చితి భస్మాం, అబీర్‌తో ఆడతారు. చితా భస్మాన్ని ఊదుకుంటూ ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటారు. దీని వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం చూసినట్లయితే.. శివ పార్వతుల వివాహం ఎలా జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే. వీరి వివాహానికి దేవతలు, రాక్షసులతో సహా సమస్త ప్రాణులను ఆహ్వానించారు. అయితే, శివ పార్వతుల వివాహం తర్వాత.. తొలిసారి కాశిని దర్శించారు. అక్కడ రంగవారి ఏకాదశి తిథి వేళ శివపార్వతులు.. ఒకరికొకరు అబీర్ పూసుకుని హోలీ ఆడారు. అబీర్ అంటే అత్తరు అని అర్ధం. అయితే, అక్కడ ఉన్న రాక్షసులు, యక్షులు, పిశాచాలు, అఘోరాలు తమతో హోలీ ఆడాలని శివయ్యను ప్రార్దించారట.

కానీ, శివయ్యకు తెలుసు కదా పుట్టిన ప్రతి మనిషి చివరికి కాటికి చేరాల్సిందే అని.. చివరకు అన్ని రంగులకు దూరం అవ్వాల్సిందే అని.. అందుకే శివయ్య అక్కడివారితో కలిసి శ్మశానవాటికలోని బూడిదతో హోలీని జరుపుకున్నారు. ఇక అప్పటినుంచి ప్రతిసారీ కాశీలో మాసాని అస్థికలతో వేడుకలను జరుపుకోవడం ప్రారంభమైంది. అది ఇప్పటివరకు ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. దీనిని మసాన్ హోలీ అంటారు. అంటే మరణ పండుగను జరుపుకోవడంతో సమానం. ఓ వ్యక్తి తన భయాన్ని అదుపులో ఉంచుకుని.. మరణ భయాన్నివదిలేసినపుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుతాడు. మసాన్ అంటే మృతదేహాలను దహనం చేసే ప్రదేశం అని అర్ధం. ఓ వ్యక్తి జీవితం ముగిసేది మసాన్ లోనే కాబట్టి.. దీనికి మసాన్ హోలీ అని పిలుస్తారు. అందుకే దీనికి కాశీలో అత్యంత ప్రాముఖ్యత ఉంది.