iDreamPost

మీరు నరసింహస్వామిని పూజిస్తారా? రాబోయే మంగళవారంతో మీ లైఫ్ టర్న్ కాబోతుంది!

  • Published May 18, 2024 | 4:50 PMUpdated May 18, 2024 | 4:50 PM

హిందూ పంచాంగం ప్రకారం..  ప్రతి  ఏటా వైశాఖ శుక్ల చతుర్దశి తిథిన నరసింహ స్వామి జయంతి జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఆ లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున పడుతుంది. అయితే ఆ రోజున ఆ స్వామి వారికి ఈ రకంగా పూజ చేస్తే ఆ లక్ష్మీ దేవికి కటాక్షం మీకు కలిగి అదృష్టం పట్టాబోతుంది.

హిందూ పంచాంగం ప్రకారం..  ప్రతి  ఏటా వైశాఖ శుక్ల చతుర్దశి తిథిన నరసింహ స్వామి జయంతి జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఆ లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున పడుతుంది. అయితే ఆ రోజున ఆ స్వామి వారికి ఈ రకంగా పూజ చేస్తే ఆ లక్ష్మీ దేవికి కటాక్షం మీకు కలిగి అదృష్టం పట్టాబోతుంది.

  • Published May 18, 2024 | 4:50 PMUpdated May 18, 2024 | 4:50 PM
మీరు నరసింహస్వామిని పూజిస్తారా? రాబోయే మంగళవారంతో మీ లైఫ్ టర్న్ కాబోతుంది!

పురణాల ప్రకారం..  శ్రీ మహా విష్ణువు మొత్తం పది అవతారాలను ధరించాడు. అందులో మహా విష్ణువు నాల్గవ అవతారమే.. నరసింహ అవతారం. అయితే ఈ   శ్రీ మహా విష్ణువు నరసింహావతారంలో..  సగం మానవ శరీరం, మిగిలిన సగం సింహం శరీరం కలిగి ఉంటుంది. కాగా, మహా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి , హిరణ్యకశిపుడనే రాక్షసుడిని చంపడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించిన రోజుని నరసింహ జయంతిని జరుపుకుంటారు.  కనుక ఆ రోజున నరసింహ స్వామిని పూజించి.. ఉపవాసం ఉంటారు.

అయితే హిందూ పంచాంగం ప్రకారం..  ప్రతి  ఏటా వైశాఖ శుక్ల చతుర్దశి తిథిన నరసింహ స్వామి జయంతి జరుపుకుంటారు. కాగా, ఈ ఏడాది మంగళవారం మే 21, 2024న  నరసింహ జయంతి జరుపుకుంటున్నారు. కాగా, ఈ సంవత్సరం నరసింహ జయంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే.. ఈ సంవత్సరం నరసింహ స్వామి జయంతి లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన మంగళవారం పడుతుంది. మరి, ఆ రోజున స్వామి వారికి భక్తి, శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజ చేసి శరణ కోరితో లక్ష్మీ  కటాక్షం ప్రతిఒక్కరి మీద కలిగుతుంది. మరి, ఆ లక్ష్మీ  దేవి అనుగ్రహం పొందలనుకునే వారు ఆరోజున ఇలా చేస్తే చాలు.. మీ జీవితంలో అదృష్టం వరింపబడుతుంది.

కనుక ప్రతిఒక్కరు నరసింహ జయంతి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం నరసింహ స్వామితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. ఇక పూజ చేసే సమయంలో నరసింహ మంత్రాలను పఠించాలి. గ్రంథాల ప్రకారం నరసింహ స్వామికి ఎర్రని బట్టలో కొబ్బరికాయను సమర్పించడం వల్ల త్వరలో మీకు శుభ ఫలితాలొస్తాయి. వీటితో పాటు నరసింహ జయంతి రోజున తీపి పదార్థాలు, పండ్లు, పూలు, కుంకుమ సమర్పించాలి. పూజ ముగించే సమయంలో నరసింహ స్తోత్రాన్ని పఠించి హారతితో పూజను పూర్తి చేయాలి.

ముఖ్యంగా ఆరోజున  ఉపవాసం ఉండే ఆ స్వామి కృప కటాక్షలు అందరీ మీద కలుగుతాయి. అలాగే మీ శక్తి  సామర్థ్యం మేరకు నరసింహ జయంతి రోజున పేదలకు అన్నదానం చేయాలి. అనంతరం మరుసటి రోజున ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేయడం వలన మీ ఖర్చులు తగ్గి , ఆదాయం పెరుగుతుందది. అంతేకాకుండా.. ఎవరైతే అప్పుల బాధతో ఇబ‍్బందులు పడుతున్న వారికి ఆ సమస్యలన్ని తొలిగిపోతాయి. దీంతో పాటు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడేవారంతా, నరసింహ స్వామికి చందనం సమర్పించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మరి, ఈ రకంగా నరసింహ స్వామి జయంతి రోజున ఈ భక్తి శ్రద‍్ధలతో పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి