కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి..!

అన్ని మాసాల్లో కార్తీక మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివుడి, మహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు భక్తులు. అయితే ఈ మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ నాడు.. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.

అన్ని మాసాల్లో కార్తీక మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివుడి, మహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు భక్తులు. అయితే ఈ మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ నాడు.. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.

ముల్లోకాలను పాలించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన మాసంలో కార్తీక మాసం ఒకటి. ఈ మాసం అంతటా దీప, ధూప నైవేద్యాలతో పూజలు చేస్తారు భక్తులు. అలాగే కార్తీక మాసం ప్రతి సోమవారం, ఏకాదశి, ద్వాదశిల నాడు దైవారాధన చేస్తుంటారు భక్తులు. ఆదివారాలు, పౌర్ణమి నాడు త్రిమూర్తుల పూజలు చేస్తుంటారు. అయితే వీటిల్లో కార్తీక పౌర్ణమి చాలా ప్రాశస్త్యం ఉంది. ఏ రోజు పూజ చేయలేని వారు ఒక్క కార్తీక పౌర్ణమి నాడు పూజలు చేస్తే.. చాలా ఫలితం దక్కుతుందని పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది కార్తీక పున్నమి నవంబర్ 27వ తేదీన వచ్చింది. ఈ తేదీన ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసినా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక పూర్ణిమ నాడు.. తలారా స్నానం చేసి.. చుక్కలు కనిపిస్తుండగానే.. ఇంట్లో దీపారాధన చేసి.. ఆ తర్వాత సమీపంలోని శివ, విష్ణు దేవాలయాల్లో పూజలు చేయాలి. తులసి కోట వద్ద మట్టి ప్రమిదల్లో లేకుంటే ఉసిరికాయల మీద, బియ్యంతో చేసిన ప్రమీదల్లో దీపాలు వెలిగించాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసి.. అందులో పసుపు, కుంకుమ సమర్పించి, పూలతో అలంకరించి.. ఆ తర్వాత ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి. వీలుంటే సముద్ర స్నానం, నదీ స్నానం చేసి.. అరటి డొప్పల్లో ఆ నీటిలో దీపాలను వదలొచ్చు. ఇలా చేయడం వల్ల పుణ్యం, అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజంతా స్త్రీలు ఉపవాసం ఉండి.. సాయంత్రం వేళ.. దీపారాధన చేసి.. శివాలయానికి వెళ్లి పూజలు చేసి.. చంద్రుడికి చలివిడి సమర్పించి.. ఆకాశ దీపాన్ని తిలకించాలి. అనంతరం ఆ ప్రసాదాన్ని స్వీకరించి..అప్పుడు భోజనం స్వీకరించాలి. ఇలా చేస్తే అదృష్టం కలుగుతుందట.

కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఎలాంటి పూజలు చేయలేకపోయామని చింతిస్తున్న వారు.. పౌర్ణమి రోజు దేవునికి దీపారాధన చేస్తే.. నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని పురాణాలు, పండితులు చెబుతున్నారు. ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు (నవంబర్​ 27) మరో ప్రత్యేకత ఉంది.  ఈ రోజున ప్రత్యేక పూజలు, నోములు,పూజలు చేస్తారు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, సత్యనారాయణ వ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు. ఇక నోములు ఉన్న వాళ్లు.. ఈ రోజున ఆ నోములు నోచుకుంటారు.

Show comments