P Krishna
Akshaya Tritiya 2024: హిందూ సంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఎంతో ఉత్సాహ పడతారు
Akshaya Tritiya 2024: హిందూ సంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఎంతో ఉత్సాహ పడతారు
P Krishna
గత కొంత కాలంగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు వారం రోజులుగా కాస్త ఊరటనిస్తున్నాయి. హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు ఈ పండుగను యావత్ భారతీయులు జరపుకుంటారు. ఈ ఏడాది మే, శుక్రవారం 10 న అక్షయ తృతీయ వచ్చింది.లక్ష్మీ దేవత ప్రసన్నం కోసం అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజు జ్యులరీ షాపుల్లో మహిళలు కిట కిటలాడుతుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు, శ్రేయస్సు పెరుగుతాయని అంటారు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నవారు బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు.. ఇతర వస్తువులు కొన్నా లక్ష్మీ దేవి ఆశిస్సులు లభిస్తాయి.. వివరాల్లోకి వెళితే..
1. బంగారం : అక్షయ తృతీయ రోజు ఒక్క గ్రాము బంగారం, వెండి కొన్నా అదృష్ట దేవత మీ వెంట వస్తుందని అంటారు.ఇది పురాణ కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. పురాణాల్లో దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథన సమయంలో ముందుగా బంగారం బయటకు వచ్చిందట.. దీన్ని విష్ణువ స్వీకరించాడు. అందుకే బంగారాన్ని లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు, ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. బంగారం కొని పూజ చేసి. ఆ వస్తువును లక్ష్మీదేవి, కుభేరుడికి సమర్పించాలి.
2.కొత్త ఇల్లు కొనడం : అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాదు.. కొత్త ఇల్లు కొనడం కూడా శుభప్రదం అంటారు. పవిత్రమైన ఈ రోజు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని అంటారు. ఈ పర్వదినం రోజున కొత్త ఇంటిని కొనుగోలు చేయడం, లేదా కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో ఎల్లపుడు ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు, కుటుంబ సభ్యులు పురోగతి ఉంటుందని నమ్మకం. ఆ రోజు లక్ష్మీ దేవి ఇంట్లో అడుగు పెడుతుందని అంటారు.
3.కొత్త వాహనం కొనుగోలు : అక్షయ తృతీయ రోజు వాహనాలు అంటే కారు, బైక్ వంటివి కొనుగోలు చేయడం కూడా శుభప్రదం అంటారు. ఆటో మొబైల్ కంపెనీలు అక్షయ తృతీయ పర్వదినం రోజున బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొన్ని కొత్త వాహనాలకు అక్షయ తృతీయ రోజున నెంబర్ల, వాహన రిజిస్ట్రేషన్లు జరపడం మంచిదని అంటారు. ఈ రోజు వాహనం కొంటే రక్షణ, విజయం లభిస్తుందని ప్రజల విశ్వాసం.
4. వెండి : అక్షయ తృతీయ రోజున వెండి వస్తువులు కొనుగోలు చేయడం కూడా శుభప్రదం అంటారు. మన స్థాయిని బట్టి వెండి వస్తువులు నాణేలు, అభరణాలు, వెండి పాత్రలు కొంటే మంచిది అంటారు. అక్షయ తృతీయ రోజు మీ స్నేహితులకు, కుటుబ సభ్యులకు వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వడం శుభప్రదం అంటారు. వెండి నాణం లక్ష్మీదేవికి చిహ్నం. పండుగ రోజు వెండి నాణానికి పూజ చేసి.. మీ ఇంట్లో డబ్బును భద్రపరిచేలా లాకర్ లో ఉంచితే మంచిది అంటారు.
5. మట్టికుండ : ధనవంతులు బంగారం, వెండి తో చేసిన కుండటను అక్షయ తృతీయరోజు కొనుగోలు చేస్తుంటారు. అయితే అంత ఖరీదైన వస్తువులు సామాన్యులు కొనలేరు. ఆ రోజు మట్టికుండను కొని ఇంటికి తెచ్చుకున్నా మంచిదే అంటారు. అక్షయ తృతీయకు మట్టికుండ కొంటే లక్ష్మీ దేవి ఆశిస్సులు లభిస్తాయని అంటారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదలు పెరుగుతాయని అంటారు.