iDreamPost
android-app
ios-app

Krishna Janmashtami: మీ పిల్లలకి కృష్ణుడి వేషం వేశారా? రాత్రి లోపు ఈ పని చేయడం మరవకండి!

  • Published Aug 26, 2024 | 7:15 PM Updated Updated Aug 26, 2024 | 7:15 PM

Krishna Janmashtami: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు కృష్ణుడి వేషం వేస్తుంటారు. అయితే మీరు మీ పిల్లలకు కృష్ణుడి గెటప్ వేస్తే కనుక రాత్రి లోపు ఈ పని చేయండి.

Krishna Janmashtami: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు కృష్ణుడి వేషం వేస్తుంటారు. అయితే మీరు మీ పిల్లలకు కృష్ణుడి గెటప్ వేస్తే కనుక రాత్రి లోపు ఈ పని చేయండి.

Krishna Janmashtami: మీ పిల్లలకి కృష్ణుడి వేషం వేశారా? రాత్రి లోపు ఈ పని చేయడం మరవకండి!

ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. బాల కృష్ణుడిగా పెద్దలను, పిల్లలను తన అల్లరితో ఎంతగానో అలరించిన శ్రీ కృష్ణుడి వేషధారణలో తమ పిల్లలను చూసుకోవాలని తల్లిదండ్రులు ముచ్చటపడుతుంటారు. అందుకోసం ఆ చిన్ని కృష్ణుడి కాస్ట్యూమ్స్ కొనేసి తమ పిల్లలకు ధరిస్తారు. ధోతి, నెమలి పింఛం, వేణువు, కిరీటం వంటి వాటితో పిల్లలను అచ్చం శ్రీ కృష్ణుడిలా అలంకరిస్తారు. అలా అలంకరించిన తర్వాత ఫోటో షూట్ నిర్వహిస్తారు. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ని పెట్టుకుంటారు. కొంతమంది సొంతంగా సెల్ ఫోన్స్ ద్వారా ఫోటోషూట్ చేసుకుంటారు. శ్రీ కృష్ణుడి గెటప్ లో చిన్న పిల్లలు ఫోజులు ఇస్తుంటే వాటిని కెమెరాల్లో బంధిస్తుంటారు. అలా బంధించిన ఫోటోలను ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తుంటారు. ఆ ఫోటోలు చూసి నచ్చిన వారు లైక్ చేస్తారు. కామెంట్స్ చేస్తారు. ఆ లైక్స్ ని, కామెంట్స్ ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంటుంది. పిల్లలు కూడా రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు రాత్రయ్యేసరికి అలసిపోతారు. ఉన్నట్టుండి నీరసపడతారు. ఇది చాలా మంది ఇళ్లలో జరిగేదే. మామూలుగా తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లినా లేదా ఎక్కువ ఆడినా పిల్లలు నీరసపడిపోతారు. ఇంట్లోంచి బయటకు వెళ్లని పిల్లలు కూడా కొన్నిసార్లు నీరసపడిపోతారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు పెట్టినప్పుడు కొంతమంది పిల్లల విషయంలో ఇలా జరుగుతుంది. దీనికి కారణం దిష్టి తగలడమే అని పెద్దలు చెబుతుంటారు. నరదిష్టి చాలా ప్రమాదకరమని.. కొంతమంది చూపు పడితే యాక్టివ్ గా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి నీరసంగా తయారవుతారని అంటారు.

అందుకే పెద్దలు రాత్రి నిద్రపోయే ముందు పిల్లలకు ఉప్పుతో దిష్టి తీస్తుంటారు. ఉప్పుని పిల్లల తల చుట్టూ మూడు సార్లు ముందుకు, మూడు సార్లు వెనక్కి తిప్పి దిష్టి తీస్తారు. అదేంటో అప్పటి వరకూ పేచీ పెట్టిన పిల్లలు వెంటనే నిద్రలోకి జారుకుంటారు. దీన్ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. దిష్టి నిజమో కాదో తెలియదు కానీ ఉప్పుని పిల్లల తల చుట్టూ తిప్పడం వల్ల ఒక సైంటిఫిక్ రియాక్షన్ అయితే జరుగుతుంది. దీని వల్ల పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. కృష్ణాష్టమికి కూడా పిల్లలను శ్రీ కృష్ణుడి గెటప్, గోపిక వేషధారణలో ముస్తాబు చేస్తారు. ఆ గెటప్స్ లో ఉన్న పిల్లల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కావాలని దిష్టి పెట్టకున్నా గానీ ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది పిల్లలకు కలుగుతుందని అంటారు. అందుకే రాత్రి నిద్రపోయే  ముందు పిల్లలకు దిష్టి తీయాలని పెద్దలు చెబుతున్నారు. దీని వల్ల నష్టం ఏమీ ఉండదు కానీ దిష్టి తీస్తే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా పెద్దలు పాటించేది ఇదే. పండుగలప్పుడే కాదు.. మిగతా సందర్భాల్లో కూడా నిద్రపోయే ముందు దిష్టి తీస్తే మంచిగా నిద్రపోతారని చెబుతారు.