P Krishna
Sri Marakata Shivalinga Someshwara Swamy Temple: శ్రావణ మాసం ప్రారంభమైంది.. తొలి శుక్రవారం కావడంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సమీపంలో మరకత సోమేశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు తకలి వెళ్తున్నారు.
Sri Marakata Shivalinga Someshwara Swamy Temple: శ్రావణ మాసం ప్రారంభమైంది.. తొలి శుక్రవారం కావడంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సమీపంలో మరకత సోమేశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు తకలి వెళ్తున్నారు.
P Krishna
భక్తులను అనుగ్రహించేందుకు మహాశివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడని పండితులు చెబుతుంటారు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథుడిని శివాలయం ప్రత్యేకమైనది. ఇక్కడ వైద్యనాథుడిగా వెలిసిన మహాశివుడు దర్శనానికి వచ్చిన భక్తులకు ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తారని అంటారు. అందుకే నిత్యం ఇక్కడికి వేల సంఖ్యల్లో భక్తులు తరలివెళ్తుంటారు. మహారాష్ట్రలోని పర్లి వైద్యానాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగి ఉన్న మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలో చందిప్ప గ్రామంలో ఉంది. దశాబ్దాలుగా మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తున్నారు భక్తులు. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం..
హైదరాబాద్ సమీపంలో ఉన్న మరకత శివలింగ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో మరకత సోమేశ్వర లింగాన్ని భక్తితో పూజిస్తే వ్యాధులు నయమవుతాయని, సకల ఐశ్వర్యాలు వస్తాయని అనాధిగా భక్తుల నమ్మకం. చందిప్ప గ్రామంలో ఉన్న మరకత సోమప్ప మహిమల గురించి భక్తులు ఎన్నో రకాలుగా చెబుతుంటారు. శ్రావణమాస శుక్రవారం సందర్భంగా వేలాది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శ్రావణ మాస తొలి శుక్రవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.పర్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి, చందిప్ప మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల రోగాలు మాయం కావడమే కాదు.. అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని, అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. క్రీస్తు శకం 1076-1126 మద్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు శాసనం ద్వారా తెలుస్తుంది. క్రీ.శ. 1101 సంవత్సరం కార్తీక శుద్ద పంచి.. గురువారం నాడు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు శాసనంలో లిఖించబడింది. ఈ పుణ్య క్షేత్రం హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.