Dharani
Ashadha Masam-Worship Banana Tree: ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. కానీ ఓ చెట్టును పూజిస్తే మాత్రం.. సిరి సంపదలు కలుగుతాయి అంటున్నారు. ఆ వివరాలు..
Ashadha Masam-Worship Banana Tree: ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. కానీ ఓ చెట్టును పూజిస్తే మాత్రం.. సిరి సంపదలు కలుగుతాయి అంటున్నారు. ఆ వివరాలు..
Dharani
హిందూ క్యాలెండర్ ప్రకారం ఛైత్ర మాసంతో కొత్త ఏడాది ప్రారంభమై.. ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే నాలుగో నెలలో ఆషాఢ మాసం వస్తుంది. ఈ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ కాలంలో కొత్తగా పెళ్లైన దంపతులు కలిసి ఉండకూడదని.. నమ్ముతారు. అందుకే నూతన వధువును పుట్టింటికి పంపుతారు. అలానే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని సూచిస్తారు. ఇక ఈ ఆషాడ మాసాన్ని విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ మాసం ఆ విష్ణుమూర్తిని ఏ అవతారంలో పూజించినా మంచి జరుగుతుందని.. ఎలాంటి దానధర్మాలు చేసినా.. శుభం జరుగుతుందని కూడా విశ్వసిస్తారు. ఆషాఢంలోనే శ్రీ మహా విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కనుక శుభ కార్యాలు చేయడాన్ని నిషేధించారు. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు కానీ.. ఓ చెట్టును పూజిస్తే.. సిరి సంపదలు కల్గుతాయని నమ్ముతారు. ఇంతకు ఆ చెట్టు ఏదంటే..
ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదు కానీ.. కొన్ని రకాల దానధర్మాలు, ప్రత్యేకించి కొన్ని చెట్లను పూజిస్తే.. సిరి సంపదలు సమృద్ధిగా కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అరటి చెట్టును పూజించడం వల్ల.. కష్టాలన్ని తొలగిపోయి.. విజయం వరించడమే కాక అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆషాఢంలో అరటి చెట్టును ఎలా పూజించాలి.. ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
ఆ తర్వాత “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించాలి. ఇష్టమున్న వారు “కేలేశ్వర స్తోత్రం” కూడా పఠించవచ్చు. పూజ తరువాత, అరటి చెట్టుకు నీరు సమర్పించాలి.
ఆషాడమాసంలో ఇలా అరటి మొక్కను పూజించడం వల్ల చాలా మేలు జరుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే… అరటి చెట్టును విష్ణువు ప్రతి రూపంగా భావిస్తారు. ఆషాఢమాసం అంటేనే విష్ణుమూర్తి మాసంగా ప్రసిద్ధి చెందింది. కనుక ఆషాఢంలో విష్ణు మూర్తికి ప్రతీక అయిన అరటి చెట్టును పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. ఆషాఢమాసంలో అరటి చెట్టును పూజించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విజయం వరిస్తుంది అని నమ్ముతారు.
గమనిక: ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ సమాచారాన్ని ‘‘ఐడ్రీమ్ మీడియా’’ ధృవీకరించడం లేదు.