iDreamPost
android-app
ios-app

అజ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి!

  • Published Aug 28, 2024 | 10:01 AM Updated Updated Aug 28, 2024 | 10:47 AM

Aja Ekadashi 2024 Telugu: హిందువులు పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అజ ఏకాదశి’ అని అంటారు. ఈ రోజు ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం..

Aja Ekadashi 2024 Telugu: హిందువులు పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అజ ఏకాదశి’ అని అంటారు. ఈ రోజు ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం..

  • Published Aug 28, 2024 | 10:01 AMUpdated Aug 28, 2024 | 10:47 AM
అజ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి!

హిందూ మతంలో ఏకాదశి పరమ పవిత్రంగా భావిస్తుంటారు.. దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో గొప్ప ఉంది. ఆనందం, ఆరోగ్యం, భోగభాగ్యాలు కలిగి ఉండాలని కోరుతూ భక్తులు ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున, భక్తులు ఉపవాసం ఉంటూ భక్తితో విష్ణువును ప్రార్థిస్తారు. అజ ఏకాదశి భాద్రపద మాసంలో కృష్ణ పక్షం 11వ రోజున జరుపుకుంటారు.ఈ ఏడాది ఆగష్టు 29, 2024న జరుపుకునే అజా ఏకాదశి. ఈ సందర్బంగా భక్తులు ఉదయం లేచి దేవాలయాలకు వెళ్లి స్వామి వారిని పూజిస్తారు.దేశమంతా వైష్ణవ దేవాలయాలు కిటకిటలాడుతాయి. అజ ఏకదాశి రోజున ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ప్రతి ఏడాదికి 24 ఏకాదశిలు..వాటిలో శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అజ ఏకాదశి’అని పిలుస్తారు. అజ ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పాటిస్తూ శ్రీ మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మిని పూజిస్తే సకల పాపాలు హరించిపోవడమే కాదు.. సకల సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు భక్తితో స్వామికి వారికి పూజలు చేస్తే అశ్వమేధ యాగానికి సమానమైన ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు.ఈ ఏడాది ‘అజ ఏకాదశి’ ఆగస్టు 29 గురువారం వచ్చింది. దీన్నే స్మార్త ఏకాదశి, గురు ఏకాదశి అని కూడా అంటారు. ప్రతి ఏటా జన్మాష్టమి నాలుగు రోజుల తర్వాత ఈ ఏకాదశి వస్తుంది. అజ ఏకాదశి రోజున  తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని వైష్ణవ దేవాలయాలకు ఎక్కువగా వెళ్తుంటారు భక్తులు.

వ్రత పారాయణం వేళలు :

గురువారం ఆగస్టు 29 ఉదయం 01.19 గంటల మొదలు కొని ఆగస్టు 30 ఉదయం 01.37 గంటల వరకు ఉంటుంది.. అజ ఏకాదశి వ్రతం గురువారం చేయాలి. శుక్రవారం 30న అజ ఏకాదశి వ్రతం పరాన్నను నిర్వహిస్తారు. ఉపవాస సమయం ఉదయం 07:49 నుంచి 08:31 గంటల వరకు ఉంటుంది. హరి వాసర్ సమయం పరాణ తిధి ఉదయం 07:49 గంటల వరకు ముగిసిపోతుంది. అజ ఏకాదశి ఉపవాసాన్ని ముగించడాన్ని వ్రత పరాన్నవం అంటారు. ఏకాదశి వ్రతం ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి ఉపవాసం పాటించాలని పండితులు చెబుతున్నారు. సూర్యో దయానికి ముందుగానే ద్వాదశి తిథి ముగిస్తే.. ఏకాదశి వ్రత పరాన్నవం సూర్యోదయం తర్వాత ముగిసిపోతుందని అంటున్నారు.

 అజ ఏకాదశి ఉపవాసం నియమాలు గురించి తెలుసుకుందాం :

  • అజ ఏకాదశి రోజున నిరాహార వ్రతాన్ని ఆచరిస్తుంటారు.. ఆ రోజు ఉపవాసం చేసిన వారు ఏమీ తినకూడదు
  • కొంతమంది మాత్రం కేవలం పండ్లును మాత్రమే తింటూ నిరాహార దీక్ష చేస్తారు
  • అజ ఏకాదశి రోజున కొంతమంది ఒక్కపూట భోజనం చేస్తుంటారు
  • ఈ రోజు ఆద్యాత్మిక గ్రంధాలను పటిస్తే శుభ్రపదం అంటారు
  • అజ ఏకాదశి రోజున విష్ణువు ఆలయాలకు వెళ్లి పూజిస్తే శుభప్రదం

హిందువుల సంప్రదాయమైన అజ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు ఉపవాసాలు, ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని అంటున్నారు పండితులు. అజ ఏకాదశి రోజున ఉపవాసం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే పండితులను సంప్రదించవొచ్చు. పలు హిందూ మత గ్రంథాలలో ఉపవా సమయం, పూజా పద్దతులు, ఫలితాల గురించి చదివి తెలుసుకోవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని ‘‘ఐడ్రీమ్‌ మీడియా’’ నిర్ధారించలేదు.