Keerthi
మన హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి నాడు హోలీ వేడుకలను జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం వచ్చే ఈ హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం అనేది దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పౌర్ణమి రోజున రాబోతుంది. కనుక ఆ రోజున ఈ 4 రాశులకు మహా రాజయోగం ప్రారంభం కానుంది.
మన హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి నాడు హోలీ వేడుకలను జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం వచ్చే ఈ హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం అనేది దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పౌర్ణమి రోజున రాబోతుంది. కనుక ఆ రోజున ఈ 4 రాశులకు మహా రాజయోగం ప్రారంభం కానుంది.
Keerthi
మన హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి నాడు హోలీ వేడుకలను జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఈ హోలీ పండుగను చిన్న నుంచి పెద్ద వరకు ఎంత ఘనంగా జరుపుకుంటారు. కానీ, ఈ ఏడాది మాత్రం వచ్చే హోలీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రానుంది. అయితే, ఈ గ్రహణం అనేది దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పౌర్ణమి రోజున రాబోతుంది. సాధారణంగా హోలీ పౌర్ణమి, చంద్ర గ్రహణం అంటే చాలా మందికి అనేక సందేహాలు అపోహాలు ఉంటాయి. అందులోకి.. వంద సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ చంద్ర గ్రహణం రావడంతో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఏ రాశుల్లో శుభలు, అశుభలు లభించనున్నాయో అని ప్రతిఒక్కరు అందోళనలో ఉంటారు. అయితే ఈ ఏడాది 100 సంవత్సరాల తర్వాత తొలిసారిగా హోలీ పౌర్ణమి రోజున వస్తున్న ఈ చంద్రగ్రహణంలో మాత్రం ఈ 4 రాశుల వారికి మాత్రం మహా రాజయోగం ప్రారంభం కానుంది. ఇక నుంచి వారు కోటీశ్వరులుగా మారబోతున్నరంటూ ఈ జ్యోతిష్య శాస్త్రంలో తెలుస్తోంది. మరి, ఈ హోలీ పండుగ నాడు ఆ నాలుగు అదృష్ట రాశుల్లో మీది ఉందో లేదో తెలుకోండి.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పౌర్ణమి నాడు సోమవారం అనగా మార్చి 25న ఏర్పడనుంది. ఆ సమయంలో జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. ఈ హోలీ రోజున సంభవించే చంద్రగ్రహణం రోజున 4 రాశుల వారిక అదృష్టం వరించబోతుందని. ఇక నుంచి వారికి మహా రాజయోగం ప్రారంభం కానుందని జ్యోతిష నిపుణులు పేర్కొన్నారు. ఇక హోలీ పండుగ నాడు సంభవించిన చంద్ర గ్రహణంకు.. ‘పెనంబ్రల్ చంద్రగ్రహణంగా’ పిలుస్తారని తెలిపారు. అయితే ఈ గ్రహణం సోమవారం రోజున హస్త నక్షత్రంలో ఏర్పడుతుంది. కనుక ఆ గ్రహణం నాడు తుల, కన్య, మిధున, వృశ్చిక రాశుల వారికి మంచి రాజయోగం సిద్ధించనుంది. ముఖ్యంగా హస్త నక్షత్రంలో ఉన్న రాశుల వారు హోమాలు, యజ్ఞ చేసుకుంటే చాలా మంచిందని జ్యోతిష్య నిపుణులు వివరించారు. మరి, ఆ నాలుగు రాశుల్లో రాబోతున్న ఆ శుభ సూచికలు ఏంటో తెలుకుందాం.
మిధున రాశి
ఈ రాశి వారికి మొదటి చంద్ర గ్రహణం సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంతవరకు మీరు పెండింగులో ఉన్న పనులన్నింటినీ ఇప్పుడు పూర్తి చేయవచ్చు. అలాగే మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుంది. దీంతో పాటు మీరు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఇక నుంచి మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది. అంతేకాకుండా.. మీ వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
తులా రాశి
తుల రాశి వారికి హోలీ వేళ చంద్ర గ్రహణం కారణంగా శుభప్రదంగా కనిపిస్తోంది. అలాగే సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. దీనితోపాటు మీ వ్యాపార పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మెరుగుపడుతుంది. ఇక నుంచి మీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆవకాశాలు ఉన్నాయి. పైగా పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలొస్తాయి. మీ కెరీర్ లో మంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో రంగంలో పనిచేసే వారికి త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. రాజకీయ రంగంలో పనిచేసే వారికి త్వరలోనే మంచి శుభవార్తలు వినబడతాయి. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కన్యా రాశి
హోలీ పండుగ నాడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం కారణంగా కన్య రాశి జాతకులకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆర్థికంగా వీరు గొప్ప సమయాన్ని అనుభవిస్తారు. కన్య రాశి వారు ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలంగాను, శుభప్రదంగానూ ఉంటుంది. లక్ష్మీ దేవి ఆశీస్సులు వీరిపై ఎప్పుడూ ఉంటాయి.
వృశ్చిక రాశి
తొలి చంద్ర గ్రహణ సమయంలో వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు పని చేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు. మీరు పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తుంటే, వారికి శుభప్రదంగా ఉంటుంది. కానీ, మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.