iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

  • Published Jul 10, 2024 | 4:35 PM Updated Updated Jul 10, 2024 | 5:20 PM

Youtuber Praneeth Hanumanth Got Arrested In Bengaluru: తండ్రీ, కుమార్తెల బంధాన్ని కించ పరుస్తూ ఒక వీడియోలో నీచమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుంతును పోలీసులు అరెస్టు చేశారు. బెెంగళూరులో ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.

Youtuber Praneeth Hanumanth Got Arrested In Bengaluru: తండ్రీ, కుమార్తెల బంధాన్ని కించ పరుస్తూ ఒక వీడియోలో నీచమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుంతును పోలీసులు అరెస్టు చేశారు. బెెంగళూరులో ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.

  • Published Jul 10, 2024 | 4:35 PMUpdated Jul 10, 2024 | 5:20 PM
బిగ్ బ్రేకింగ్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. డార్క్ కామెడీ, ర్యాంట్ వీడియోస్ పేరిట నచ్చిన వాళ్లని.. ఇష్టారీతిన ట్రోల్ చేయడం వీళ్ల హాబీ. దానిని వీడియోగా చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటారు. ఇన్నాళ్లు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ని ట్రోల్ చేస్తూ వచ్చిన వీళ్లు.. ఇటీవల ఒక మీమ్ మీద వీడియో చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఎంతో దారుణంగా, నీచాతినీచంగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై నెట్టింట తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎలాగైనా వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ హీరోలు, సెలబ్రిటీలు నెట్టింట డిమాండ్ చేశారు. ఇప్పుడు వారి డిమాండ్లు ఫలించి ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు.

తండ్రీ కూతుళ్ల బంధంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రణీత్ హనుమంతు పెద్దఎత్తున చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. కామన్ మ్యాన్ దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అంతా వారిని అరెస్టు చేయాలని.. కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పడు ఆ కేసుకు సంబంధించి పోలీసులు ప్రణీత్ హనుమంతును అరెస్టు చేశారు. బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ సహా మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. మొదట ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరు పరుస్తారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ పై అతడిని హైదరాబాద్ తీసుకురానున్నారు. మిగిలిన ముగ్గురిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet