iDreamPost
android-app
ios-app

కృష్ణా నదిలో దూకిన స్వాతి.. ఆమె కష్టం తెలిసి అందరూ షాక్‌!

  • Published Jul 13, 2023 | 1:38 PM Updated Updated Jul 13, 2023 | 1:38 PM
  • Published Jul 13, 2023 | 1:38 PMUpdated Jul 13, 2023 | 1:38 PM
కృష్ణా నదిలో దూకిన స్వాతి.. ఆమె కష్టం తెలిసి అందరూ షాక్‌!

ప్రేమ పేరుతో కొంతమంది ఆకతాయిలు దారుణాలకు పాల్పడుతున్నారు. తమను ప్రేమించటం లేదన్న కోపంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రేమ వేధింపుల కారణంగా ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా, తెలంగాణలోని మిర్యాలగూడలో కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపులు భరించలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

మిర్యాలగూడలోని గణేష్‌పహాడ్‌కు చెందిన కొర్ర స్వాతి సూర్యాపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మెగావత్‌ హుస్సేన్‌ స్వాతిని ప్రేమిస్తున్నాడు. ఐటీఐ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్న అతడు తరచుగా ఆమె వెంటపడేవాడు. ఫోన్లు చేస్తూ బాగా ఇబ్బందిపెట్టేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఓ సారి స్వాతి తన తల్లిదండ్రులకు హుస్సేన్‌పై ఫిర్యాదు చేసింది. వారు అతడ్ని మందలించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ స్వాతి వెంటపడేవాడు.

ఫోన్‌ ద్వారా ఆమెను వేధించేవాడు. ఈ నేపథ్యంలో స్వాతి హుస్సేన్‌ వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైంది. చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది. గ్రామానికి దగ్గరలో.. కృష్ణా నది ఒడ్డున ఉన్న పంప్‌హౌజ్‌పై నుంచి నదిలోకి దూకింది. బుధవారం ఆమె మృతదేహం ఒడ్డుకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. స్వాతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు హుస్సేన్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet