iDreamPost
android-app
ios-app

Dundigal: దారుణం.. దుండిగల్ లో మహిళ దారుణ హత్య!

  • Published Sep 24, 2024 | 3:31 PM Updated Updated Sep 24, 2024 | 4:27 PM

Dundigal: దుండిగల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడి దొంగలు విధ్వంసం సృష్టించారు. మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద(50) అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు.

Dundigal: దుండిగల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడి దొంగలు విధ్వంసం సృష్టించారు. మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద(50) అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు.

  • Published Sep 24, 2024 | 3:31 PMUpdated Sep 24, 2024 | 4:27 PM
Dundigal: దారుణం.. దుండిగల్ లో మహిళ దారుణ హత్య!

ప్రస్తుత సమాజంలో సులభంగా డబ్బులు సంపాదించాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దొంగతనలాకు పాల్పడుతూ..అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు వంటి వాటిల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా మహిళలు ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటున్నారు. అడ్డు వస్తే హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే చోరీ ఘటనల్లో అనేక హత్యలు జరిగిన సంగతి తెలిసింది. తాజాగా హైదరాబాద్ నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధఇలో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యంత దారుణంగా దొంగలు హత్య చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

దుండిగల్ ప్రాంతంలోని మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో శారద అనే 50 ఏళ్ల మహిళ తన కుటుంబంతో నివాసం ఉంటుంది. మంగళవారం ఆమెను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకెళ్లారు. ఇక ఈ ఘటనపై మృతురాలి కుమారుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా..ఇల్లంతా కూడా రక్తపు మరకలు కనిపించాయి. దీన్ని బట్టి ఆమెను దొంగలు ఎంత దారుణంగా హత్య చేసారో తెలుస్తుంది. ఆ రక్తపు మరకలను చూస్తుంటే ఆ మహిళా ఆ దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుందని తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇదేదో ప్లాన్ చేసి తెలిసిన వాళ్ళే హత్య చేసారేమో అని టాక్ కూడా వినిపిస్తోంది. ఆమె అరుపులు స్థానికులకు వినపడకుండా అతి దారుణంగా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్టు సమాచారం తెలుస్తుంది.

ఇక మృతురాలి కుటుంబ విషయానికి వస్తే.. మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో తన కుమారుడు సాయి వినయ్ తో కలిసి ఆమె నివాసం ఉంటుంది. రోజూ సాయి వినయ్ ఉద్యోగానికి వెళ్లాగా..శారద ఒంటరిగానే ఇంట్లో ఉంటుంది. సోమవారం ఉదయం కూడా శారదను యథావిధిగా ఇంట్లోనే ఉంచి సాయి వినయ్ తన పనికి వెళ్లాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చే ముందు..తన తల్లికి వినయ్ ఫోన్‌ చేశాడు. అయితే ఆ సమయంలో ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతడికి సందేహం వచ్చి తన తల్లి గురించి పక్కింటి వారికి కాల్ చేశాడు. దీంతో పక్కింటి వాళ్లు సాయి వాళ్ల ఇంటికి వెళ్లి చూడగా.. దారుణమైన స్థితిలో శారద కనిపించింది. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న శారదను చూసి వారు షాక్ అయ్యారు. దీంతో వెంటనే సాయి వినయ్ కి సమాచారం అందించడంతో అతడు వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

నిందితులు ఆమెను హత్య చేసి బంగారు చెవిపోగులు, ముక్కు పుడకను దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కూడా జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇలాంటి దారుణ ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా ఉన్న పిల్లలు, వృద్ధులు, మహిళనలు టార్గెట్ గా చేసుకుని దుండగలు దారుణాలకు తెగబడుతున్నారు. చోరీ సమయంలో ఎదురు తిరిగిన వారిని అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఒంటరిగా ఇళ్లలో ఉండేందుకు ఆడవాళ్లు భయపడుతున్నారు. ఇలాంటి నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి..ఇంతటి దారుణమైన హత్య గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetmilanobetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio