iDreamPost
android-app
ios-app

మొసళ్లున్న నదిలోకి మూగ బిడ్డను విసిరేసిన కసాయి తల్లి

భార్యా భర్తల మధ్య గిల్లి కజ్జాలు కామన్. ఒక రోజు తిట్టుకుంటారు. మరుసటి రోజు కలిసి పోయి సినిమాలకు షికార్లకు వెళుతుంటారు. కలహాలు లేని కాపురం.. సంసారం కూడా అనిపించుకోదు. కానీ ఇదే గొడవల కారణంగా..

భార్యా భర్తల మధ్య గిల్లి కజ్జాలు కామన్. ఒక రోజు తిట్టుకుంటారు. మరుసటి రోజు కలిసి పోయి సినిమాలకు షికార్లకు వెళుతుంటారు. కలహాలు లేని కాపురం.. సంసారం కూడా అనిపించుకోదు. కానీ ఇదే గొడవల కారణంగా..

మొసళ్లున్న నదిలోకి మూగ బిడ్డను విసిరేసిన కసాయి తల్లి

అపార్థాలు, అలకలు, గొడవలు, వ్యక్తిగత దూషణలు భార్యా భర్తల బంధంలో కామన్. కోపంతో ఎన్నోన్నో మాటలు అనుకుంటారు. భర్తపై భార్య అరవడం, సతిపై సహనం కోల్పోయి పతి చేయిచేసుకోవడం వంటి ఘటనలు 90 శాతం మంది దంపతుల్లో చోటుచేసుకునేవి. ఆగ్రహంతో వస్తువులు కూడా విసురుకుంటారు. ఆ తర్వాత మళ్లీ కలిసిపోతుంటారు. కానీ తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవల్లో పిల్లలు కూడా బలౌతుంటారు. ఎక్కువగా భర్త తనపై అరిచినా, చేయి చేసుకున్నా.. పిల్లలపై ఆవేశంతో తల్లి తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తగాదాల కారణంగా.. పుట్టుకతో వికలాంగుడైన కొడుకుని మొసలికి ఆహారం చేసిందో కసాయి తల్లి. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

భర్త తనతో గొడవ పడ్డాడన్న కోపంతో మూగ కొడుకుని మొసలి ఉండే నదిలోకి విసిరేసింది. ఆ తర్వాత పశ్చాతాప్త పడింది. కానీ అప్పటికే ఆ చిన్నారి మొసలి నోట్లో మృతదేహమై లభించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కన్నడ జిల్లా దండేలి తాలూకాలోని హలమడిలో నివాసం ఉంటున్నారు భార్యా భర్తలు రవి కుమార్, సావిత్రి. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బాల వినోద్.. పుట్టుకతో మూగ. ఈ కొడుకు పరిస్థితిపై దంపతులు తరచూ గొడవ పడేవారు. అలాంటి బిడ్డ ఎందుకు పుట్టాడంటూ సావిత్రిని ప్రశ్నించేవాడు భర్త రవి. ఇదే విషయంపై శనివారం సాయంత్రం కూడా గొడవ జరిగింది. దీంతో విసుగుపోయిన సావిత్రి.. కోపంతో కొడుకును తన ఇంటికి సమీపాన ఉన్న మొసళ్లు ఎక్కువగా ఉండే కాళీ నదికి కలిసే.. కాల్వలోకి విసిరేసింది. ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డైవర్ల సాయంతో చిన్నారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే చీకటి పడిపోవడంతో చిన్నారి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం.. మళ్లీ గాలించగా..బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. తీవ్రమైన గాయాలు, శరీరం అంతటా గాట్లు ఉండటంతో అలాగే చేయి కట్ అయిన స్థితిలో మృతదేహాం లభించడంతో.. మొసలి దాడికి గురయ్యాడని గుర్తించారు పోలీసులు. కాగా, తాను చేసిన పనికి తల్లికి కన్నీరు మున్నీరు అయ్యింది. నేరాన్ని అంగీకరించి పశ్చాతాప్త పడింది. మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్దారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. ఈ ఘటనపై ఐపీసీలో సెక్షన్ 109, 302 కింద కేసు కేసు నమోదు చేశారు పోలీసులు. భార్య భర్తలిద్దరినీ అరెస్టు చేశారు.  కోపం మీద. . నోట మాట రాని కొడుకుని తన చేతులతో తానే చంపేసింది సావిత్రి.