iDreamPost
android-app
ios-app

నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా ఒకరితో…

  • Published Dec 28, 2023 | 1:32 PM Updated Updated Dec 28, 2023 | 1:32 PM

ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తాజాగా, ఓ మహిళ ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా నలుగుర్ని పెళ్లి చేసుకుంది.

ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తాజాగా, ఓ మహిళ ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా నలుగుర్ని పెళ్లి చేసుకుంది.

  • Published Dec 28, 2023 | 1:32 PMUpdated Dec 28, 2023 | 1:32 PM
నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా ఒకరితో…

ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆడవాళ్లు పెళ్లి పేరుతో మగవాళ్లను మోసం చేస్తున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు తరచుగా ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి పేరుతో దగ్గరవ్వటం.. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిని దోచేసి పరారు అవ్వటం వంటివి బాగా జరుగుతున్నాయి. కొందరు మహిళలు ముగ్గురు, నలుగురు మగాళ్లను కూడా పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

తాజాగా, ఓ మహిళ పెళ్లి పేరుతో ఏకంగా నలుగురు మగాళ్లను మోసం చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసింది. ఈ సంఘటన కర్ణాటకలోని దావణగెరెలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  దావణగెరె ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం సోషల్‌ మీడియా ద్వారా మండ్య జిల్లాలోని స్నేహ అనే యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కొంత కాలానికే ప్రేమగా మారింది. 2022, ఫిబ్రవరి నెలలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఓ సంవత్సరం పాటు ఇద్దరూ కలిసి ఉన్నారు. అయితే, కొన్ని నెలల క్రితం స్నేహ గర్భం దాల్చింది. కాన్పు కోసం పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ఆమె వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన తర్వాత ఆమె మళ్లీ తిరిగి రాలేదు. అక్కడ అబార్షన్‌ చేయించుకుంది. తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా ప్రశాంత్‌కు తెలిసింది. స్నేహ బంధువులను ఈ విషయం గురించి విచారించగా.. ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోవటాని కంటే ముందే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి అయినట్లు తెలిసింది.

దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ప్రశాంత్‌ పోలీసులను ఆశ్రయించాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కుండా చూడాలని కోరాడు. ఆమెపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మొత్తం నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్నేహపై జనం మండిపడుతున్నారు.

పెళ్లి కోసం కడుపులో బిడ్డను సైతం చంపిన ఆమె క్రూరత్వంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నారు. మరి, ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా నలుగురు వ్యక్తుల్ని స్నేహ పెళ్లి చేసుకుని మోసం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetrupi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş