iDreamPost
android-app
ios-app

పాపం.. భర్త కోరిక ఆ మహిళ కొంప ముంచింది!

పాపం.. భర్త కోరిక ఆ మహిళ కొంప ముంచింది!

ఆడ, మగ అన్న తేడా లేకుండా ఈ మధ్య కాలంలో అందంపై శ్రద్ధ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా జుట్టు విషయంలో అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జుట్టు కొద్దిగా ఊడటం మొదలైతే చాలు టెన్షన్‌ స్టార్ట్‌ అవుతుంది. డాక్టర్ల దగ్గరకో.. లేదా హెయిర్‌ కేర్‌, బ్యూటీ సెంటర్లకో క్యూ కట్టేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే అందాన్ని మెరుగుపర్చుకోవటానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ, కొన్ని సార్లు ఈ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. అందం ఏమో కానీ.. లేని పోని కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి.

తాజాగా, ఓ మహిళ తన జుట్టు అందాన్ని పెంపొందించుకోవటానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. భర్త కోరికే ఆమె కొంప ముంచింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఓల్డ్‌ సిటీకి చెందిన ఓ మహిళ భర్తకు తన భార్యను మోడల్‌గా చూడాలన్నది కోరిక. భర్త కోరికను ఆమె కాదనలేకపోయింది. మోడల్‌ అవ్వటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోడల్‌ అవ్వాలంటే ఇంకా అందంగా కనిపించాలని ఆమె భావించింది. ఇందుకోసం అబిడ్స్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.

వారు ఆమె అందానికి కొన్ని మెరుగులు దిద్దారు. అనంతరం పొడుగ్గా ఉన్న ఆమె జుట్టును కత్తిరించారు. ఆమెకో హెయిర్‌ ఆయిల్‌ ఇచ్చి వాడమన్నారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆమె ప్రతీ రోజూ ఆ ఆయిల్‌ వాడ్డం మొదలుపెట్టింది. ఇక, అప్పటినుంచి ఆమె జుట్టు కొద్దికొద్దిగా ఉడుతూ వస్తోంది. ఉన్న జుట్టు మొత్తం పోయింది. జుట్టు ఊడిపోవటంతో భర్తకు, ఆమెకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. సదరు బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యూటీ పార్లర్‌ వారిని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నించగా వారు పరారయ్యారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş