iDreamPost
android-app
ios-app

UP: సీన్ రీవర్స్.. కూతురుని చంపాలనుకొని కాటికి పోయిన తల్లి.. సినిమాని మించిన ట్విస్టులు!

  • Published Oct 14, 2024 | 12:26 PM Updated Updated Oct 14, 2024 | 12:26 PM

UP: తాజాగా రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఒకటి జరిగింది. అందులోని ట్విస్టులకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ క్రైమ్ స్టోరీ ఆశ్చర్యపోయేలా ఉంటుంది.

UP: తాజాగా రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఒకటి జరిగింది. అందులోని ట్విస్టులకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ క్రైమ్ స్టోరీ ఆశ్చర్యపోయేలా ఉంటుంది.

  • Published Oct 14, 2024 | 12:26 PMUpdated Oct 14, 2024 | 12:26 PM
UP: సీన్ రీవర్స్.. కూతురుని చంపాలనుకొని కాటికి పోయిన తల్లి.. సినిమాని మించిన ట్విస్టులు!

మనం ఇప్పటివరకు చాలా రకాల క్రైమ్ సినిమాలు చూశాం. ఆ సినిమాలలోని ట్విస్టులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. చాలా షాకింగ్ గా ఉంటాయి. అయితే నిజ జీవితంలో కూడా సినిమాలకు మించిన క్రైమ్ స్టోరీలు జరుగుతున్నాయి. ఎంతలా అంటే దిమ్మ తిరిగి మతి పోయే విధంగా ఉన్నాయి. గతంలో ఇలాంటి స్టోరీలని చాలానే చూశాం. తాజాగా మరో రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఒకటి జరిగింది. అందులోని ట్విస్టులకు కచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఇలా కూడా జరుగుతుందా అనే రేంజిలో ఈ క్రైమ్ స్టోరీ ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ క్రైమ్ స్టోరీ ఏంటి? ఎక్కడ జరిగింది? ఇందులో జరిగిన షాకింగ్ ట్విస్ట్ లు ఏంటి? ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షాకింగ్ ట్విస్టులతో కూడిన ఈ హత్య ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఓ మైనర్‌ అమ్మాయి ప్రేమలో పడింది. ఆ విషయం ఆమె తల్లికి తెలిసింది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను చంపాలని తల్లి డిసైడ్ అయ్యింది. అందుకు ఓ ప్లాన్‌ వేసింది. తన కూతుర్ని తన చేతులతో చంపితే జైలుకి వెళుతుందని భయపడింది. తనని చంపడానికి ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చింది. తన కూతురుని చంపమని అతనికి డబ్బు ముట్టజెప్పింది. ఇంతకీ అతడెవరనేదే ఇక్కడ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ ట్విస్టు. అంతేకాదు ఆ మైనర్‌ బాలికను చంపడానికి ఆమె తల్లి నుంచి డబ్బు తీసుకున్న అతడు చివరకి ఏం చేశాడన్నది మరో షాకింగ్ ట్విస్టు.ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లా జశ్రత్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్య జరిగింది. అక్కడ అక్టోబర్‌ 6న ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని నయగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్లాపూర్‌ నివాసిగా గుర్తించారు. ఆమె పేరు అల్కా. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఇక ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వారి విచారణంలో వారే షాకయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్కాను చం‍పిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఆ ట్విస్ట్ అనేది బయట పడింది. తన 17 ఏళ్ల కూతురు ఎవరీనో ప్రేమించిందన్న విషయం తెలుసుకున్న అల్కా బాగా సీరియస్‌ అయింది. ఆమెను ఫారూఖాబాద్‌లోని తన అమ్మ నాన్నల ఇంటికి పంపించేసింది. అయితే కూతురు ఏమాత్రం మారలేదు. ఆమె వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదు. ఫోన్‌లో ప్రేమికుడితో గంటల తరబడి మాట్లాడుతుందట. దాంతో ఆమె పనులు నచ్చక ఆమెను తీసుకెళ్లాలని పుట్టింటివారు అల్కాకు గట్టిగా చెప్పారు. దీంతో తన పరువు పోయిందని అల్కా బాగా ఫీల్ అయింది. కూతురుపై కోపంతో రగిలిపోయింది. ఇలాంటి కూతురు తనకు వద్దనుకుంది. చివరికి ఆమెను చంపాలని డిసైడ్ అయ్యింది.

తన​ కూతుర్ని చంపేందుకు సెప్టెంబర్‌ 27న సుభాష్‌ సింగ్‌(38) అనే వ్యక్తిని కలిసిం‍ది. తన కుమార్తెను చంపితే 50 వేల రూపాయలు ఇస్తానని ఆఫర్‌ చేసింది. ఈ ఆఫర్ అతనికి నచ్చింది. అయితే ఇక్కడ మలుపు ఏంటంటే తన కూతురు ప్రేమించిన వ్యక్తి సుభాషే. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం ఇక్కడ మరో ట్విస్టు. మరి తన ప్రేయసిని చంపమని ఆమె సొంత తల్లే సుపారీ ఇచ్చిందని తెలిసి సుభాష్‌ ఊరుకుంటాడా? నేరుగా తన ప్రేయసి దగ్గరకు వెళ్ళాడు. జరిగిదంతా చెప్పాడు. తన తల్లి తనని చంపాలనుకుంటుందా అని ఆ బాలిక షాక్ అయ్యింది. ఇక్కడ సుభాష్ మరో ప్లాన్‌ వేశాడు. అల్కాను చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆమెను అడ్డు తొలగించుకుంటే తామిద్దరం హాయిగా పెళ్లిచేసుకోవచ్చని ప్రియురాలితో చెప్పాడు. ప్రియుడి మాటలు నమ్మిన ఆ బాలిక అందుకు సరే అంది. వీరిద్దరూ కలిసి పథకం పన్నారు. ఇక తమ ప్లాన్ ప్రకారం అల్కాను హత్య చేశారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. అల్కాను తామే హత్య చేసినట్టు పోలీసులు ముందు ఈ నిందితులు ఒ‍ప్పుకున్నారు. పాపం కూతురిని చంపడానికి ప్రయత్నించిన ఆల్కా చివరకి తన గొయ్యి తానే తీసుకుంది. తాను తెలీక నమ్మిన కూతురి ప్రియుడి చేతిలోనే తాను హతమైంది. ఇదీ సంగతి. ఇక ఈ కేసులో ట్విస్టులకు పోలీసులే ఆశ్చర్యపోయరంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎలాంటి క్రైమ్ స్టోరీ అనేది. మరి సినిమాని తలదన్నిన ఈ క్రైమ్ స్టోరీ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş