Uppula Naresh
Uppula Naresh
కర్ణాటకలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళను సెక్యూరిటీ గార్డ్ ఆంటీ అన్నాడని అతనిపై కోపంతో దాడికి దిగింది. ఇష్టం వచ్చినట్లు అతనిపై స్లిప్పర్ తో దాడి చేస్తూ రచ్చ రచ్చ చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరులో ఓ ATM సెంటర్ వద్ద ఓ మహిళ డబ్బులు డ్రా చేసుకుని డోరుకు అడ్డంగా నిలబడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డ్ అడ్డుగా ఉన్న ఆమెను.. ఆంటీ కొంచెం పక్కకు జరగండి అని మర్యాద పూర్వకంగా అడగాడు. దీంతో ఆ మహిళ.. నన్ను ఆంటీ అంటావా అంటూ అతనిపై స్లిప్పర్ తో ఇష్టమొచ్చినట్లు దాడికి దిగింది. అక్కడున్న కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న ఆ మహిళను అడ్డుకున్నారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆమెను విడుదల చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నెజటిజన్స్ స్పందిస్తూ ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంటీ అన్నాడని సెక్యూరిటీ గార్డ్ పై దాడికి దిగిన ఆ మహిళ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.