iDreamPost
android-app
ios-app

కొడుకు, తండ్రి మృతి! పాపం, ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు!

  • Published Jul 07, 2023 | 6:17 PM Updated Updated Jul 07, 2023 | 6:17 PM
  • Published Jul 07, 2023 | 6:17 PMUpdated Jul 07, 2023 | 6:17 PM
కొడుకు, తండ్రి మృతి! పాపం, ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు!

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొడుకుతో పాటు తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణవార్త తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారి గ్రామస్తులు.. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదంటూ కంటతడి పెట్టుకున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ హన్మకొండలోని కనకదుర్గ కాలనీలో రవీందర్-దివ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారుల సంతానం. రవీందర్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. అయితే, గత రెండేళ్ల నుంచి రవీందర్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఇతడు గత మూడు రోజుల నుంచి ఇంటి వద్దే ఉన్నాడు. ఇదిలా ఉంటే.., రవీందర్ ఎప్పటిలాగే ఇటీవల ఓ రోజు స్కూల్ కు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి పెద్ద కుమారుడు శ్రీచరణ్ (8) వెంటబెట్టుకుని గ్రామ సమీపంలోని ఓ చెరువు వద్దకు వెళ్లాడు.

ఇక ఎవరూ లేని సమయంలో రవీందర్ తన కొడుకుతో పాటు ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రమైన రవీందర్ ఇంటికి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఖంగారుపడి స్థానిక ప్రాంతాల్లో గాలించారు. కానీ.., రవిందర్, అతని కొడుకు జాడ మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ చెరువు వద్ద రవీందర్ బైక్ ఉన్నట్లు గ్రామస్తులు గమనించారు. అనుమానంతో అందులో గాలించగా.. రవీందర్ తో పాటు అతని కుమారుడు శ్రీచరణ్ మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet