iDreamPost

తల్లిదండ్రులను చంపిన కొడుకు! సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!

తల్లిదండ్రులను చంపిన కొడుకు! సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!

తల్లిదండ్రులను చంపిన కేసులో కుమారుడికి న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తాజా తీర్పుతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని పులుసుమామిడికి గ్రామంలో సారదిక్ మియా-ఆశాబీలు దంపతులు నివాసం ఉండేవారు. వీరికి రషిద్ పాషా అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2014లో రషిద్ పాషా ఏదో అంశంపై తన తల్లిదండ్రులపై గొడవకు దిగాడు. ఇదే కోపంతో కన్నవాళ్లు అని కూడా చూడకుండా వారిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇక అనంతరం మృతుని కుటుంబ సభ్యులు స్పందించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు రషిద్ పాషాను అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు. ఇదిలా ఉంటే బుధవారం ఈ కేసును విచారించిన కూకట్ పల్లి కోర్టు నిందితుడికి జీవితఖైదు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.13 వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇక నిర్ణయంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తల్లిదండ్రులను చంపిన కుమారుడికి జీవితఖైదు శిక్ష విధించిన న్యాయస్థానం తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి