iDreamPost
android-app
ios-app

ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది.. కానీ, ఆ టార్చర్ తట్టుకోలేకపోయింది!

  • Published Oct 27, 2023 | 7:59 PM Updated Updated Oct 27, 2023 | 8:00 PM

ఈమెకు 2017లో వివాహం జరిగింది. కొన్ని రోజులు గడచిందో లేదో.. ఆమెకు అసలు టార్చర్ మొదలైంది. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్ల పాటు నరకం చూపించింది. అసలేం జరిగిందంటే?

ఈమెకు 2017లో వివాహం జరిగింది. కొన్ని రోజులు గడచిందో లేదో.. ఆమెకు అసలు టార్చర్ మొదలైంది. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్ల పాటు నరకం చూపించింది. అసలేం జరిగిందంటే?

  • Published Oct 27, 2023 | 7:59 PMUpdated Oct 27, 2023 | 8:00 PM
ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది.. కానీ, ఆ టార్చర్ తట్టుకోలేకపోయింది!

ఈమె పేరు వీరమణి. 2017లో ధరూర్ కు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడచిందో లేదో.. ఆమెకు అసలు టార్చర్ మొదలైంది. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్ల పాటు నరకం చూపించారు. ఇక ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. వీరమణి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లికి చెందిన వీరమణి (30)ని ధరూరుకు చెందిన జక్కెపల్లి లాల్ కుమార్ కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. పెళ్లిలో భాగంగానే కొంత కట్న కానుకలు ఇచ్చారు. కొన్నాళ్లకి ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అలా చాలా కాలం పాటు ఈ భార్యాభర్తల సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. కొన్నేళ్ల తర్వాత భర్త లాల్ కుమార్, అతని తల్లి అదనపు కట్నం తేవాలంటూ వీరమణిని వేధించడం మొదలు పెట్టారు. దీంతో వారు పోడు పడలేక ఆ మహిళ పుట్టింటి వాళ్లకు చెప్పి రెండు దఫాలుగా రూ 5 లక్షలుపైగానే ముట్టజెప్పింది. అయినా చాలదంటూ లాల్ కుమార్.. మరింత తేవాలంటూ టార్చర్ పెట్టాడు. ఇక రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువవడంతో వీరమణి తట్టుకోలేకపోయింది.

ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన వీరమణి ఏనాడు సంతోషంగా గడప లేదు. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. ఆ మహిళ బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నట్టుండి కూతురు ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం పేరుతో మా కూతురుని చాలా కాలంగా వేధించారని, ఇది తట్టుకోలేకే వీరమణి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అదనపు కట్నం పేరుతో వీరమణిని టార్చర్ పెట్టిన ఆమె భర్త, అత్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş