iDreamPost
android-app
ios-app

వీడియో: రైల్వే స్టేషన్‌లో గొడవ.. ప్రియుడి కళ్ల ముందే యువతి దారుణం

  • Published May 29, 2024 | 10:04 AM Updated Updated May 29, 2024 | 10:04 AM

ప్రియుడితో గొడవపడిన యువతి.. క్షణికావేశంలో.. తీసుకున్న దారుణ నిర్ణయం.. తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ప్రియుడితో గొడవపడిన యువతి.. క్షణికావేశంలో.. తీసుకున్న దారుణ నిర్ణయం.. తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 10:04 AMUpdated May 29, 2024 | 10:04 AM
వీడియో: రైల్వే స్టేషన్‌లో గొడవ.. ప్రియుడి కళ్ల ముందే యువతి దారుణం

ఆవేశం.. మనిషి చేత ఎలాంటి దారుణం అయినా చేయిస్తుంది. సమాజంలో చోటు చేసుకునే అనేక నేరాలకు కారణం ఆవేశమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని క్షణాల పాటు ఆవేశాన్ని కంట్రోల్‌ చేసుకోగలిగితే.. ఆ తర్వాత పరిస్థితులు నార్మల్‌గా ఉంటాయి. అయితే మనలో చాలా మందికి తప్పు జరిగిన తర్వాతే జ్ఞానోదయం అవుతుంది. ఛా.. తొందరపడ్డాను..అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటాము. అదే కోపంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన వస్తే.. నేరాలు జరగవు.. జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక తాజాగా ఆవేశంలో ఓ యువతి తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని మిగిల్చిందో మీరే చూడండి.

వారిద్దరూ లవర్స్‌.. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. ఆ ఆవేశంలో యువతి ప్రాణాలు తీసుకోవాలని భావించింది. వారిద్దరూ ఉంది రైల్వే స్టేషన్‌లో. ఆవేశంలో ఉన్న యువతి ఆలోచన మరిచి.. రైలు పట్టాలపైకి దూకింది. సరగ్గా అప్పుడే అటు వైపు నుంచి రైలు వేగంగా వచ్చింది. చనిపోవాలని భావించిన యువతి.. ముందుగా రైలుకు ఎదురెళ్లింది. కానీ తర్వాత ప్రాణాల మీద ఆశ కలిగిందే ఏమో కానీ.. బయటపడాలని చూసింది. కానీ అప్పటికే దారుణం జరిగింది. రైలు ఆ యువతిని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆమె శరీరం రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య నలిగిపోయి నుజ్జు నుజ్జయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం అనగా మే 27, ఉదయం 11 గంటలకు రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న లవర్స్‌ ఇద్దరూ.. ప్లాట్‌ఫామ్‌ మీద కూర్చుని దేని గురించో గొడవపడుతున్నారు.

వివాదం కాస్త పెద్దది కావడంతో.. క్షణికావేశంలో సదరు యువతి.. రైల్వే ట్రాక్‌పైకి దూకింది. అయితే రైలు సమీపంలోకి రాగానే.. మళ్లీ ప్లాట్‌ఫారమ్‌ వైపు పరిగెత్తింది. కానీ అప్పటికే పట్టాల మీదకు వచ్చిన కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆమెను ఢీకొట్టింది. దాంతో రైలు పట్టాలు, ప్లాట్‌ఫామ్‌ మధ్య యువతి శరీరం నుజ్జునుజ్జయ్యింది. ఇదంతా చూసిన ప్రియుడు భయంతో బిక్క చచ్చిపోయాడు. రైలు ఆగగానే అక్కడి నుంచి పారిపోయాడని తెలుస్తోంది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet