iDreamPost
android-app
ios-app

నిశ్చితార్థం జరిగింది.. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా..!

  • Published Oct 21, 2023 | 12:15 PM Updated Updated Oct 21, 2023 | 12:15 PM

మనిషిని మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు హఠాత్తుగా మన నుంచి దూరమైపోతుంటారు.

మనిషిని మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు హఠాత్తుగా మన నుంచి దూరమైపోతుంటారు.

  • Published Oct 21, 2023 | 12:15 PMUpdated Oct 21, 2023 | 12:15 PM
నిశ్చితార్థం జరిగింది.. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా..!

ఈ యువతిని చిన్నప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా పెంచి పెద్ద చేశారు. ఇక పెళ్లి వయసు రావడంతో మంచి యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే మూడు నెలల కిందట ఓ యువకుడితో నిశ్చితార్థం కూడా జరిపించారు. మరో వారం రోజుల్లో పెళ్లి, దీంతో ఆమె కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లలో నిమిగ్నమయ్యారు. ఇక మరో వారం రోజుల్లో పెళ్లి ఉండగా వారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని జాస్తిపల్లి గ్రామం. ఇక్కడే దురిశెట్టి తిరుమలరావు-మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భార్గవి (20) అనే కుమార్తె ఉంది. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఇక కూతురికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావించారు. ఇందులో భాగంగానే మూడు నెలల కిందట ఓ యువకుడితో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇదిలా ఉంటే.. గత 10 రోజుల కిందట భార్గవికి జ్వరం రావడంతో దగ్గరలోని ఓ వైద్యుడిని సంప్రదించారు. కానీ, ఆ యువతి ఆరోగ్యం నయం కాలేదు.

ఇటీవల ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక మరో వారం రోజుల్లో పెళ్లి ఉండడంతో ఆమె తల్లిదండ్రులు కూతురు ఆస్పత్రిలో ఉండగానే అన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. కానీ, విషాదం ఏంటంటే? పరిస్థితి విషమించడంతో ఆ యువతి చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా ఆ యువతి చనిపోవడంతో అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş