iDreamPost
android-app
ios-app

దారుణం.. తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు.. అందుకేనా?

  • Published Feb 23, 2024 | 3:35 PM Updated Updated Feb 23, 2024 | 3:35 PM

ఈ మధ్య కొంతమంది క్షణికావేశంలో కనీ పెంచిన తల్లిదండ్రులను దారుణంగా హతమార్చుతున్నా.. అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ మధ్య కొంతమంది క్షణికావేశంలో కనీ పెంచిన తల్లిదండ్రులను దారుణంగా హతమార్చుతున్నా.. అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

  • Published Feb 23, 2024 | 3:35 PMUpdated Feb 23, 2024 | 3:35 PM
దారుణం.. తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు.. అందుకేనా?

‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడు’ అంటూ ప్రముఖ కవి అందెశ్రీ పాడిన పాటలో ఎంతో పరమార్ధం ఉంది. ఆధునిక సమాజాజంలో వస్తున్న మార్పులు మానవ సంబంధాలు పూర్తిగా మంటకలిసిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసకుంటూ.. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా విలవిలలాడిపోతారు. కానీ పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు.. ఆస్తుల కోసం చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. అంతేకాదు హత్యలకు కూడా తెగబడుతుంటారు. అలాంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులను కొడుకు కత్తితో అతి దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం బోండపల్లిలో చోటు చేసుకుంది. మండంలని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోలా రాము (55), ఆయన భార్య జయలక్ష్మి(30) ను మొదటి భార్య కుమారుడు డోల లక్ష్మణరావు అతి దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. డోలా రాము తన స్వగ్రామంలో దేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు డోల పైడి రాజు.. విశాఖలో జాబ్ చేస్తున్నాడు.

రెండవ కుమారుడు డోల లక్ష్మణ రావు చిన్న చిన్న పనులు చేస్తూ బతుకుతున్నాడు. డోలా రాము ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య జయలక్ష్మి కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. వీరికి ఒక కుమార్తె జన్మించింది. పాప పేరు చంద్రిక.. బండపల్లిలో 8వ తరగతి చదువుతుంది. కొంత కాలంగా తన కుటుంబాన్ని పట్టించుకోకుండా రెండో భార్యకు అన్నీ చేస్తున్నాడని పగతో రగిలిపోయాడు లక్ష్మణ్ రావు. సమయం చూసి ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ పొద్దున లక్ష్మణ్ మాటు వేసి తండ్రి రాములు.. సవతి తల్లి జయలక్ష్మిని అతి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet