iDreamPost
android-app
ios-app

టీ షర్ట్ విషయంలో గొడవ.. ప్రాణాలు తీసింది!

  • Published Apr 06, 2024 | 3:59 PM Updated Updated Apr 06, 2024 | 3:59 PM

Srikakulam Crime News: ఇటీవల ప్రతి చిన్న విషయానికి కొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి.

Srikakulam Crime News: ఇటీవల ప్రతి చిన్న విషయానికి కొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి.

  • Published Apr 06, 2024 | 3:59 PMUpdated Apr 06, 2024 | 3:59 PM
టీ షర్ట్ విషయంలో గొడవ.. ప్రాణాలు తీసింది!

ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేయడం, కొన్నిసార్లు హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ కి గురై క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నిండుకుంటున్నాయి.  ఒక చిన్న గొడవ కారణంగా అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీకాకులం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలో తులభక్తుల రమేష్ (31), సురేష్ అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటూ కార్పేంటర్ వర్క్ చేస్తూ జీవిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం రమేష్ కి వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. గురువారం రాత్రి రమేష్ టీ షర్టు ను తమ్ముడు సురేష్ ధరించాడు. నా టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావ్ అంటూ తమ్ముడిపై గొడవకు దిగాడు రమేష్. ఇదేం పెద్ద నేరామా? నా బట్టలు నువు ఎన్నిసార్లు వేసుకోలేదు అంటూ అన్నపై ఫైర్ అయ్యాడు సురేష్. ఇలా ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.

అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుండగా పెద్దలు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలోనే రమేష్ ని తమ్ముడు సురేష్ గట్టిగా నెట్టాడు. పక్కనే ఉన్నరాళ్లపై పడి రమేష్ తలకు తీవ్రంగా గాయం అయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో రమేష్ కన్నుమూశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయానికే క్షణికావేశానికి గురై అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం ప్రాణాలు పోయేవరకు వచ్చింది. కుటుంబ పెద్దని కోల్పోయిన రమేష్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet