iDreamPost
android-app
ios-app

యువతిపై ప్రేమోన్మాది దాడి.. అసలేం జరిగిందంటే?

  • Published Jan 17, 2024 | 2:40 PM Updated Updated Jan 17, 2024 | 2:40 PM

ఇటీవల కొంతమంది ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్నారు.. తమ అవసరం తీరిపోయిన తర్వాత అత్యంత గారుణంగా హత్యలు చేస్తున్నారు. ఈ కారణంతోనే యువతుల తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారాలను వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల కొంతమంది ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్నారు.. తమ అవసరం తీరిపోయిన తర్వాత అత్యంత గారుణంగా హత్యలు చేస్తున్నారు. ఈ కారణంతోనే యువతుల తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారాలను వ్యతిరేకిస్తున్నారు.

  • Published Jan 17, 2024 | 2:40 PMUpdated Jan 17, 2024 | 2:40 PM
యువతిపై ప్రేమోన్మాది దాడి.. అసలేం జరిగిందంటే?

ఇటీవల చాలామంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై ఎదుటివారిపై దాడులు చేయడం, బలవన్మరణాలకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంటుంది. ఆర్దిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇతర సమస్యలతో చాలా మంది తమ సహనం కోల్పోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన ప్రేమను కాదన్న కారణంగా కొంతమంది యువకులు అమ్మాయిలను అత్యంత పాశవికంగా హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ తరహా ఘటన ఒకటి కర్ణాటకలో షిమోగా పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒకే గ్రామానికి చెందిన యువతీ, యువకుడు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కానీ ఆ ప్రేమికుల కుటుంబ సభ్యులు మాత్రం వారి ప్రేమను వ్యతిరేకించాయి. అంతేకాదు పెద్దలను ఎదిరించలేని ఆ యువతి అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. విచక్షణ కోల్పోయి యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన షిమోగా పట్టణం శివప్ప నాయక్ సర్కిల్ వద్ద చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. షిమోగా నగరంలోని ఓ గ్రామానికి చెందిన అంభికఅనే యువతిని అదే గ్రామానికి చెందిన చేతన అనే యువకుడు ప్రేమించాడు. కొంతకాలం తర్వాత వీరి ప్రేమ పెద్దలకు తెలిసింది. చేతన్ కి మద్యం, చెడు అలవాట్లు ఉన్నాయన్న కారణంతో అతని ప్రేమను వ్యతిరేకించారు తల్లిదండ్రులు.. వారి మాట కాదనలేకపోయింది అంభిక. దీంతో తన ప్రేమను వ్యతిరేకించి అంభిక ఇంటి చుట్టూ మద్యం సేవించి నానా రచ్చ చేసేవాడు చేతన్. అంతేకాదు తన ప్రేమను కాదన్న అంబికను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే అంభిక తమ బంధువు పుట్టిన రోజు వేడుక సందర్భంగా షిమోగా నగరానికి వచ్చింది. పుట్టిన రోజు కానుక  కొనడానికి తన స్నేహితురాలితో స్కూటీపై మార్కెట్ కి వెళ్లింది. అంభిక షిమోగా నగరానికి వచ్చిన విషయం తెలుసుకొని చేతన్ తనతో తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచాడు. ఇది చూసి స్థానికులు చేతన్ ని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ అంభికను షిమోగాలోని మెగాన్ జిల్లా హాస్పిటల్ లో చేర్పించారు. మరోవైపు ప్రేమోన్మాది చేతన్ తకు గాయం అయ్యింది. తన ప్రేమను కాదన్న కారణంతోనే హత్యకు తెగబడినట్లు పోలీసులు వద్ద ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అంబిక తల్లిదండ్రులు చేతన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు యువతిపై హత్యకు తెగబడిన అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş