iDreamPost
android-app
ios-app

దారుణం.. అప్పు చెల్లించలేదని చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగించారు!

  • Published Sep 21, 2023 | 8:17 AM Updated Updated Sep 21, 2023 | 1:33 PM
  • Published Sep 21, 2023 | 8:17 AMUpdated Sep 21, 2023 | 1:33 PM
దారుణం.. అప్పు చెల్లించలేదని చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగించారు!

ఇటీవల సమాజంలో అమానవీయ సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. డబ్బు కోసం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు అప్పు తీసుకొని సమయానికి చెల్లించని వారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిపై దాడి చేయడమే కాదు.. నగ్నంగా ఊరేగించడం తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి వెల్లుల్లి వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వ్యాపార నిమిత్తం ఆ వ్యక్తి నెల రోజుల క్రితం మార్కెట్ లో కమీషన్ ఏజెంట్ గా ఉన్న సుందర్ నుంచి రూ.5 వేల రూపాలు అప్పుగా తీసుకున్నాడు. సుందర్ వచ్చి తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని వ్యాపారిని అడిగాడు. తన వద్ద ప్రస్తుతం రూ.2,500 లు ఉన్నాయని.. మిగిలిన డబ్బు కొద్దిరోజుల తర్వాత ఇస్తానని ప్రాదేయపడ్డాడు. తాను ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని గొడవకు దిగాడు. వ్యాపారి ఎంత వేడుకున్నా సుందర్ వినకుండా తనతో వచ్చిన వారితో కలిసి వాగ్వాదానికి దిగాడు.

గదిలోకి తీసుకువెళ్లి కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడి బట్టలు చించి నగ్నంగా మార్కెట్ లో ఊరేగించారు. వ్యాపారిని అలా చేయడం పద్దతి కాదని తోటి వ్యాపారులు చెబుతున్నా వారిని బెదిరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే స్పందించి దాడి చేసిన సుందర్… అతనికి సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు సుందర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు.. వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş