యువకుల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి ఏం చేసిందంటే?

Nalgonda Crime News: ఇటీవల దేశంలో ఎక్కడ చూడు ఆడవాళ్లపై దౌర్జన్యాలు, అత్యాచాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోతుంది.

Nalgonda Crime News: ఇటీవల దేశంలో ఎక్కడ చూడు ఆడవాళ్లపై దౌర్జన్యాలు, అత్యాచాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోతుంది.

దేశంలో మహిళలపై రోజు రోజుకీ లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కొంతమంది మృగాళ్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. నిర్భయలాంటి చట్టాలు వచ్చినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేకుండా పోతున్నాయి. దారుణం ఏంటేంటే మైనర్లు కూడా ఇటీవల అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. ఓ యువతి కాలేజ్ కి వెళ్తున్న సమయంలో ప్రతిరోజూ కొంతమంది యువకులు వేధించడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులతో చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.

సాధారణంగా కాలేజ్ కి వెళ్తున్న యువతులకు ఆకతాయిల వేధింపులు ఉంటాయన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు వాళ్ల వేధింపులు శృతి మించి ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పటి వరకు హడావుడి చేసి తర్వాత వదిలేస్తుంటారు. అలా కొంతమంది యువకులు చేసే అల్లరి, ఆకతాయి పనులు యువతి ప్రాణాలు బలికొంది.  నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, మాడుగులపల్లి మండలం కక్కడం గ్రామానికి చెందిన కొత్త రామలింగం, రజిత దంపతులక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు కళ్యాణి (18) ని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంత కాలంగా వేధిస్తున్నారు. వారి ఆగడాలు శృతి మించిపోయాయి.

తమకు లొంగకపోతే నీ ఫోటోలు వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలో లో అసభ్యంగా పోస్ట్ చేస్తామని బెదిరించారు. వారి వేధింపులు తట్టుకోలేక కళ్యాణి ఈ నెల 6న మధ్యాహ్నం తమ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కానీ ఫలితం దక్కలేదు.. చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి కొత్త రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

Show comments