iDreamPost
android-app
ios-app

పెండ్లి బృందంపై కారుతో దాడి.. యువతి దుర్మణం!

  • Published Jan 05, 2024 | 10:18 AM Updated Updated Jan 05, 2024 | 10:18 AM

పెళ్లంటే నూరేళ్ల పంట.. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుతుంటారు. పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల పెళ్లింట విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే..

పెళ్లంటే నూరేళ్ల పంట.. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుతుంటారు. పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల పెళ్లింట విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే..

  • Published Jan 05, 2024 | 10:18 AMUpdated Jan 05, 2024 | 10:18 AM
పెండ్లి బృందంపై కారుతో దాడి.. యువతి దుర్మణం!

ఇటీవల మృత్యువు ఏ రూపంలో ముంచుకు వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాలతో మృత్యు వడిలోకి చేరుకుంటున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కనిపించని లోకానికి వెళ్ళిపోతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాధారణంగా గ్రామాల్లో ఆదిపత్య పోరు, పొలాలు, భూములకు సంబంధించిన గొడవలు జరగడం సహజం.. కొంతమంది వాటిని మనసులో దాచుకొని అదును చూసి కక్ష్య తీర్చుకుంటారు. అలాంటి ఘటన ఒకటి మెదక్‌ జిల్లా వెలుగు చూసింది.. పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఓ ఉన్మాది చేసిన పనికి పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బంధుమిత్రులు సమక్షంలో ఓ యువతి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి కూతురిని అత్తారింటికి పంపించారు.. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది పెళ్లి బృందంపై కారుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ యువతి మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీతో గురువారం రాత్రి జరిగింది.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. స్థానిక ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ పెళ్లి గురువారం జరిగింది. అందరూ సంతోషంగా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. సాయంత్రం సువర్ణకి అప్పగింతలు చెప్పి మెట్టినింటికి పంపించారు. తిరిగి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, ఉప్పు వెంకటి గొడవ పడ్డారు. వీరికి గత కొంత కాలంగా భూమి పంచాయితీ నడుస్తుంది. పెళ్లింట ఏదైనా పరాభవం చేయాలని ఉప్పు నరేందర్ అనుకున్నాడు.

కోపంతో రగిలిపోయిన నరేందర్ తన కారుతో పెండ్లి బృందంపై తొలడంతో ఉప్పు రమ్య(20), ఉప్పు దుర్గయ్య, యాదగిరి, ఉప్పు సుజాత, బబ్జు కు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటువైపు భీం రావ్ పల్లికి చెందిన కాపు యాదగిరి బైక్ పై వస్తుండగా అతనిపై కూడా దూసుకువెళ్లాడు.. దీంతో యాదగిరి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని నార్సింగి హాస్పిటల్ కి తరలించారు. ఉప్పు రమ్య, దుర్గయ్య ల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో రమ్య కన్నుమూసింది. విషయం గురించి తెలిసిన చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లిలో ఎంతో సందడి చేసిన రమ్య కానరాని లోకానికి వెళ్లిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.. కుటుంబ సభ్యులు, బంధులు కన్నీరు మున్నీరయ్యారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetovis girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis