iDreamPost
android-app
ios-app

కొడుకుకి పుట్టినరోజు చేసి.. తల్లి సంచలన నిర్ణయం! ఇలా చేసిందేంటి?

  • Published Mar 30, 2024 | 7:36 PM Updated Updated Mar 30, 2024 | 7:36 PM

Mangalore Crime News: దేవుడిచ్చిన బంగారం లాంటి జీవితాన్ని సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విధి వారి జీవితాలతో మరోలా ఆడుకుంటుంది.

Mangalore Crime News: దేవుడిచ్చిన బంగారం లాంటి జీవితాన్ని సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విధి వారి జీవితాలతో మరోలా ఆడుకుంటుంది.

  • Published Mar 30, 2024 | 7:36 PMUpdated Mar 30, 2024 | 7:36 PM
కొడుకుకి పుట్టినరోజు చేసి.. తల్లి సంచలన నిర్ణయం! ఇలా చేసిందేంటి?

ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే గొడవలు, కొట్లాటలకు దిగుతున్నారు. సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు అప్పటికప్పుడు తేలిపోతుంటాయి. కొన్ని సందర్బాల్లో ఆ గొడవలు పెద్దవిగా మారి పెద్దల వద్దకు వెళ్తుంటాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో చాలా మంది మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు డిప్రేషన్ కి గురై ఆ క్షణంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఎదుటి వారిపై దాడులు చేయడం లేదా బలవన్మరణాలకు పాల్పపడటం చేస్తున్నారు.  ఓ మహిళ తన ముద్దులొలికే కొడుకు మొదటి పుట్టిన రోజు జరిపించి ఎవరూ ఊహించని పని చేయడం మంగుళూరు లో తీవ్ర కలకలం రేపుతుంది.

దక్షిణ కన్నడ విషాద ఘటన చోటు చేసుకుంది. మంగుళూరు శివార్లలోని అడయార్ డ్యామ్ సమీపంలోని నేత్రావతి నదిలో ఓ తల్లీ తన కొడుకుతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్చి 29 మధ్యాహ్నం నుంచి తల్లీబిడ్డ కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే బంధువులు, స్నేహితులు ఇతర ముఖ్య ప్రాంతాల్లో వెతికారు కుటుంబ సభ్యులు. కానీ తల్లీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ టుంబ సభ్యులు వీరి వివరాలు తెలియజేయాలని సోషల్ మీడియా వేధికగా విజ్ఞప్తి చేశారు. కనిపించకుండా పోయిన వివాహిత పేరు చైత్ర, ఆమె ఏడాది వయసు గల బాబు పేరు దివ్యాన్ష్. చైత్ర గురువారం డేరకట్లోని ఓ సేవాశ్రమంలో తన కొడుకు దివ్యాన్ష్ పుట్టిన రోజు వేడుకలు ఎంతో సంబరంగా నిర్వహించింది.

శుక్రవారం నుంచి తల్లీ, బిడ్డ కనిపించకుండా పోయారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. కానీ హరికేల వంతెన వద్ద తల్లీకొడుకు మృతదేహాలను  మత్స్యకారులు  గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం తరలించారు. ఈ ఘటనపై మంగుళూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కుటుంబ కలహాల కారణంగా ఆమె కొడుకుతో ఆత్మహత్య చేసుకుందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక ఎవరైనా కావాలని హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom