iDreamPost
android-app
ios-app

తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేమించి ప్రియుడిని దూరం చేసుకోలేక

  • Published Mar 13, 2024 | 7:40 PM Updated Updated Mar 14, 2024 | 1:39 PM

Mancherial Crime News: చిన్న చిన్న కారణాలకే తీవ్ర మనస్థాపానికి గురై బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లోనే జరుగుతున్నాయని అంటున్నారు.

Mancherial Crime News: చిన్న చిన్న కారణాలకే తీవ్ర మనస్థాపానికి గురై బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లోనే జరుగుతున్నాయని అంటున్నారు.

  • Published Mar 13, 2024 | 7:40 PMUpdated Mar 14, 2024 | 1:39 PM
తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేమించి ప్రియుడిని దూరం చేసుకోలేక

ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై  సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఎవరినీ ఇబ్బంది పెట్టవొద్దని బలవన్మరణానికి పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. వారు తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబ సభ్యులు దుఖఃలో మునిగిపోతున్నారు. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల, అనారోగ్యం కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా మందమర్రి మామిడి గుట్టలో బుధవారం తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. గత కొంత కాలంగా నెన్నెల మండలం చిత్తాపూర్ కు చెందిన తీగుల్ల భగవాన్ (21), మందమర్రి మండలం మామిడిగుట్టకు చెందిన సంగీత (21) ప్రేమించుకుంటున్నారు. లైఫ్ లో స్థిర పడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అంతలోనే విధి వారి జీవితాలతో ఆడుకుంది. తనకు పెళ్లి చూపులు చేస్తున్నారని తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేమించి ప్రియుడిని దూరం చేసుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది.

ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా భగవాన్ కి తెలిసింది. అంతే ఒక్కసారే గుండె పగిలిపోయింది. తన ప్రియురాలు లేని జీవితం ఇక తనకు వద్దని భావించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన భగవాన్.. చిత్తాపూర్ లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భగవాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి వరకు తమతో కలిసి మెలిసి ఎంతో సంతోషంగా ఉన్న సంగీత, భగవాన్ ఇక లేరన్న విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని బంగారు జీవితాన్ని గడపాలనుకున్న జంట అర్థాంతరంగా జీవితాలను ముగించుకోవడం గ్రామస్థుల హృదయాలను కలచి వేస్తున్నాయి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş