iDreamPost
android-app
ios-app

బంగారం లాంటి జీవితం.. చిన్న కారణంతో నవవధువు ఎంతపని చేసిందంటే!

  • Published Sep 04, 2024 | 7:46 PM Updated Updated Sep 05, 2024 | 12:00 PM

Mallial Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Mallial Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • Published Sep 04, 2024 | 7:46 PMUpdated Sep 05, 2024 | 12:00 PM
బంగారం లాంటి జీవితం.. చిన్న కారణంతో నవవధువు ఎంతపని చేసిందంటే!

ఈ మధ్యా చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. మనస్థాపానికి గురైనపుడు చదువు, విజ్ఞానం ఉన్న వాళ్లు కూడా అనాలోచితంగా ఆలోచిస్తూ అనార్ధాలకు పాల్పపడుతున్నారు. కోపంతో ఊగిపోతు ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతున్నారు. మరికొంతమంది తమను తామే అంతం చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగతున్నాయని పోలీసులు అంటున్నారు. తాజాగా ఓ నవ వధువు చిన్న విషయానికే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో వివాహ బంధానికి ఎంతో గౌరవం ఉంది. పెద్దల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. ఎన్నో ఆశలతో అత్తారింటికిలోకి అడుగు పెట్టిన నవ వధువు ఏడాది కాకుండానే ఆత్మహత్యకు పాల్పపడటం తీవ్ర కలకం రేపింది. ఈ విషాద ఘటన మాల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామంలో చోటు జరిగింది. తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన కనుక స్వామి చిన్న కూతురు భాగ్యలక్ష్మిని మ్యాడంపల్లిలో తడగొండ దినేష్ కి ఇచ్చి గత నెల 18న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

హైదరాబాద్ లో ఉంటున్న అత్తారింటికి వచ్చిన భాగ్యలక్ష్మి మంగళవారం పుట్టింటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, తన మనసు బాగాలేదని, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాని, లోకంలో ఉండటం ఇష్టం లేక చనిపోతున్నట్లు చేతిపై రాసుకొని బాత్రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet